AP : ఏపీ లిక్కర్ స్కామ్: చెవిరెడ్డికి మళ్లీ నిరాశ, 12 మంది పరారీలోని నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్లు:ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బెయిల్ నిరాకరణ, లిక్కర్ స్కామ్‌లో మరో 12 మందికి అరెస్ట్ వారెంట్లు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. గత నెల 17న బెంగళూరు నుంచి కొలంబో వెళ్లే ప్రయత్నంలో చెవిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టు ఆదేశాలతో అప్పటి నుంచి ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. గత 40 రోజులకు పైగా జైలులోనే ఉన్న ఆయనకు, బెయిల్ కోసం చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మరోసారి ఆయన బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరోవైపు, లిక్కర్ స్కామ్ కేసులో పరారీలో ఉన్న నిందితులపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.
పరారీలో ఉన్న 12 మందిని అరెస్ట్ చేయడానికి వారెంట్లు జారీ చేయాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం వారి అరెస్ట్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో అవినాశ్ రెడ్డి, పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, షేక్ సైఫ్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బొల్లారం శివ, రాజీవ్ ప్రతాప్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు.
Read also:Chandrababu : సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు పర్యటన: పెట్టుబడులే లక్ష్యం
