Kavitha : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్-బీఆర్ఎస్ రగడ: కవితపై మహేష్ గౌడ్ ఆగ్రహం

Congress vs BRS on BC Reservations: Mahesh Goud Slams K Kavitha

Kavitha : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్-బీఆర్ఎస్ రగడ: కవితపై మహేష్ గౌడ్ ఆగ్రహం:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనతను తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ బీసీ రిజర్వేషన్ల నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనతను తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశయం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని ఆయన ఉద్ఘాటించారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని వివరించారు.

బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీకి, కవితకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ప్రశ్నించారు. తాము చేసిన పనికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏమిటని నిలదీశారు. కవితను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పదేళ్లు ఏం చేశారో చెప్పకుండా ఆమె బీసీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ అజెండా, రేవంత్ రెడ్డి నిబద్ధత అని ఆయన స్పష్టం చేశారు.

Read also:AP : లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు: రజత్ భార్గవను ప్రశ్నించిన సిట్

 

Related posts

Leave a Comment