Junior Movie : ‘జూనియర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బామ్మ ‘వైరల్ వయ్యారి’ డ్యాన్స్ – అదరగొట్టిన సుమ కూడా:రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తాజా చిత్రం ‘జూనియర్’. పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు.
వైరల్ వయ్యారి సాంగ్ సెన్సేషన్
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన తాజా చిత్రం ‘జూనియర్’. పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు.
ఈ సినిమాలోని “వైరల్ వయ్యారి నేనే… వయసొచ్చిన అణుబాంబును” అనే సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ పాటకు సంబంధించిన స్టెప్పులు, డ్యాన్స్ వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ పాటకి కాలు కదుపుతూ అదరగొడుతున్నారు.
తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఓ వృద్ధురాలు ఈ పాటకి ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వృద్ధురాలి జోష్ చూసిన ప్రముఖ యాంకర్ సుమ కూడా ఆమెతో కలిసి స్టేజ్ మీద స్టెప్పులేయడం విశేషం. ప్రతి ఒక్కరూ బామ్మ డ్యాన్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే, ఈ బామ్మ మరెవరో కాదు. బామ్మ పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచిన మణి. ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల స్టెప్పులకు యూత్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
Reada also:AkashPrime : ఆకాశ్ ప్రైమ్ క్షిపణి వ్యవస్థ విజయవంతం: భారత సైన్యానికి మరో బలం
