Kavitha : బీసీ బిల్లు కోసం కవిత 72 గంటల దీక్ష: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవసరమో తెలియజేయడానికి ఆగస్టు 4, 5, 6 తేదీలలో ఆమె ఈ దీక్ష చేపట్టనున్నారు.
కవిత దీక్ష: బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవసరమో తెలియజేయడానికి ఆగస్టు 4, 5, 6 తేదీలలో ఆమె ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలనూ ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కేవలం బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న డ్రామా అని ఆమె అభివర్ణించారు. మరోవైపు, బీజేపీ నాయకులు బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పుకు తిరుగుతున్నారని కవిత విమర్శించారు.
Read also:AP : ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం: సీఎం చంద్రబాబు పర్యటనపై కీలక ప్రకటనలు
