AP and Telangana : ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ కొట్టివేత: సుప్రీంకోర్టు కీలక తీర్పు

Apex Court Upholds 2026 Delimitation Rule for AP, Telangana Constituencies

AP and Telangana : ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ కొట్టివేత: సుప్రీంకోర్టు కీలక తీర్పు:ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది.ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపునకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీ, తెలంగాణ నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చింది.ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపునకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. 2026లో తొలి జనగణన తర్వాతే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొంది.

ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతిస్తే మిగతా రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రాలలో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి సారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. జమ్మూకశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం ఏకపక్షం కాదని చెబుతూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

Read also:Kurnool :భారత డ్రోన్ యుద్ధతంత్రంలో మరో మైలురాయి: కర్నూలులో విజయవంతమైన క్షిపణి ప్రయోగం!

 

Related posts

Leave a Comment