Trump : ట్రంప్ హెచ్చరిక: మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు షాక్!

Trump's Warning to Tech Giants: Focus on Americans, Not Indians

Trump : ట్రంప్ హెచ్చరిక: మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు షాక్! : డొనాల్డ్ ట్రంప్ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థలకు భారతీయులను నియమించుకోవద్దని హెచ్చరించారు. అమెరికన్లపై దృష్టి సారించాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన AI సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

టెక్ కంపెనీల ప్రపంచవాదంపై ట్రంప్ విమర్శలు

ట్రంప్ టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని తీవ్రంగా విమర్శించారు. చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకుని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు.

మన దేశంలోని భారీ టెక్ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ, భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ, ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. ఆ విషయం మీకు తెలుసు. అమెరికన్ల అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగాయి.

ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. AI రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్ కంపెనీలు అమెరికా కోసమే. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పని చేయాలి. మీరూ అదే చేయాలి. నేను కోరుకునేది కూడా అదే” అని ట్రంప్ అన్నారు.

Read also:Health News : ఇన్సులిన్ అవసరం లేకుండా రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ: ఇదే 10-10-10 రూల్!

 

Related posts

Leave a Comment