-
ఏపీలో ఆటో డ్రైవర్లకు రూ.15వేలు
-
ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్టేటస్
-
ఆధార్ నంబర్ ఆధారంగా చెక్ చేయొచ్చు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
ముఖ్య అంశాలు:
- సహాయ మొత్తం: ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తారు.
- ఎందుకు? ‘స్త్రీ శక్తి’ (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం కారణంగా జీవనోపాధి ఇబ్బంది ఎదుర్కొంటున్న డ్రైవర్ల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ఎప్పుడు? అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నాడు ఈ ఆర్థిక సాయం మొత్తం 3.10 లక్షల మంది అర్హులైన డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై సుమారు రూ. 466 కోట్ల భారం పడుతుంది.
పథకం స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?
అర్హత జాబితాలో మీ పేరు ఉందో లేదో లేదా మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి ఆన్‌లైన్ సదుపాయం ఉంది.
- అధికారిక వెబ్‌సైట్ తెరవండి:
https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main - హోమ్ పేజీలో “Application Status / Public Navasakam Application Status” ఎంచుకోవాలి.
- Scheme డ్రాప్‌డౌన్‌లో “Financial Assistance to Auto and Maxi Cab Owners (Auto Driver Sevalo / Vahana Mitra)” ఎంచుకోండి.
- మీ 12 అంకెల ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ఎంటర్ చేసి Submit / Check Status బటన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే మీ దరఖాస్తు స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- Read also : AlluSirish : అల్లు శిరీశ్ పెళ్లి కబురు: త్వరలో ఓ ఇంటివాడు!
