CP.Radhakrishnan : నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్: తల్లి ఉద్వేగభరిత వ్యాఖ్యలు

C.P. Radhakrishnan Elected as New Vice President of India
  • భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక
  • కుమారుడి విజయంతో తల్లి జానకీ అమ్మాళ్ ఆనందం
  • సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో కొడుక్కి ఆ పేరు పెట్టిన తల్లి

కొత్తగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్‌ (సీపీ రాధాకృష్ణన్‌) తల్లి జానకీ అమ్మాళ్ ఆనందానికి అవధులు లేవు. దాదాపు 62 ఏళ్ల క్రితం తన భర్త సరదాగా అన్న మాటలు ఇప్పుడు నిజం కావడంతో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడి పేరు వెనుక ఉన్న కథను ఆమె పంచుకున్నారు.

1957లో తన కుమారుడు పుట్టినప్పుడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్నారని జానకీ అమ్మాళ్ గుర్తుచేసుకున్నారు. “ఆయన ఒక ఉపాధ్యాయుడు. నేను కూడా టీచర్‌నే. ఆయన నుంచి స్ఫూర్తి పొంది నా కుమారుడికి రాధాకృష్ణన్ అని పేరు పెట్టాను. అప్పుడు నా భర్త నన్ను చూసి, ‘నీ కుమారుడు కూడా ఉపరాష్ట్రపతి అవుతాడని ఆ పేరు పెట్టావా?’ అని సరదాగా అన్నారు. ఇన్నేళ్లకు ఆయన మాటే నిజమైంది. చాలా సంతోషంగా ఉంది” అని ఆమె తెలిపారు.

రాధాకృష్ణన్‌ సోదరుడి ఆనందం

సీపీ రాధాకృష్ణన్ సోదరుడు సీపీ కుమారేశ్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సోదరుడు రాజ్యసభ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రధాని మోదీ పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన తప్పక నిలబెట్టుకుంటారు. ఈ విజయం మాకెంతో ఆనందాన్నిచ్చింది” అని కుమారేశ్ అన్నారు.

రాధాకృష్ణన్‌ రాజకీయ ప్రస్థానం

తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబరు 20న జన్మించిన రాధాకృష్ణన్, చిన్న వయసు నుంచే ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్‌ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు విజయం సాధించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో అనేక బాధ్యతలు చేపట్టిన ఆయన, ఝార్ఖండ్, మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలు అందించారు. తెలంగాణకు కూడా అదనపు గవర్నర్‌గా వ్యవహరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్. వెంకటరామన్ తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన మూడో వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

Read also : Telangana : తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు

 

Related posts

Leave a Comment