-
సంచిలో కోట్లాది రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి తరలింపు
-
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద నుండి స్వాధీనం
-
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా హైడ్రోఫోనిక్ గంజాయిని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి సుమారు రూ. 12 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఒక సంచిలో తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికురాలిపై కేసు నమోదు చేసి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం, 1985 కింద అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. హైడ్రోఫోనిక్ గంజాయి అనేది భారతదేశంలో నిషేధించబడిన మాదక ద్రవ్యం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ నేరం యొక్క తీవ్రతను బట్టి కోర్టు విచారణ కొనసాగుతోంది.
Read also : Europe : సైబర్ దాడితో అస్తవ్యస్తమైన విమానయాన సేవలు: యూరప్‌లోని విమానాశ్రయాలపై భారీ దాడి
