Pawan Kalyan : ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

pawan kalyan

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 54వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా మోదీ ఎక్స్ (X)లో పోస్టు చేస్తూ,
“శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అనేకమంది ప్రజల హృదయాలలో, మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మంచి పాలనపై దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో NDAని బలోపేతం చేస్తున్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. సినీ రంగంలో పవర్ స్టార్గా పేరు తెచ్చుకుని, ప్రజా జీవితంలోనూ విశేషమైన ప్రభావాన్ని చూపారు.

‘తోలి ప్రేమ’ (1998), ‘ఖుషి’ (2001), ‘గబ్బర్ సింగ్’ (2012), ‘అత్తారింటికి దారేది’ (2013) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో అగ్రస్థానంలో నిలిచి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ముఖ్యమైన శాఖలను ఆయన భాధ్యత వహిస్తున్నారు.

జనసేన పార్టీ ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ (TDP), భారతీయ జనతా పార్టీ (BJP)లతో కలసి 2024 లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పరచుకుంది.

ఆ కూటమి ఘన విజయాన్ని సాధించగా, జనసేన పార్టీ పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు అన్నీ గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ తానే పిఠాపురం నియోజకవర్గంలో 70,000 పైగా మెజారిటీతో గెలుపొందారు.

Read : ChandrababuNaidu : నారా చంద్రబాబు నాయుడు: 30 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానం

Related posts

Leave a Comment