సంక్షిప్త వార్తలు:04-22-2025:జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్… రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీమంత్రి జీవన్ రెడ్డి పాల్గోన్నారు. పేరు తీయకుండా ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావ్. అభివృద్ధి ముసుగు తొడిగి పార్టీ లోకి వచ్చావ్ . నా కన్నా నీకు ఎక్కువ అనుభవం ఉందా అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరో సారి ఘాటు వ్యాఖ్యలు
జగిత్యాల
జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మాజీమంత్రి జీవన్ రెడ్డి పాల్గోన్నారు. పేరు తీయకుండా ఎమ్మెల్యే సంజయ్ పై హాట్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ లోకి స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చావ్. అభివృద్ధి ముసుగు తొడిగి పార్టీ లోకి వచ్చావ్ . నా కన్నా నీకు ఎక్కువ అనుభవం ఉందా అని ప్రశ్నించారు. ఏం.. నాకు అభివృద్ధి చేత కాదా . నీలాగా నేను నియోజకవర్గం లో పోటీ పడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం ల తో పోటీ పడ్డా . అప్పటి వైస్సార్ కు దీటుగా పని చేశా. పులివెందులలో ఏం ఉంటే.. జగిత్యాల కు అవే తెచ్చా . నడిచే వాళ్ళ కాళ్ళ లో కట్టెలు పెడతావా . ఏందీ నువ్వు ఇక్కడ చేసేదని అన్నారు.
కర్రి గుట్టల వైపు కగార్ ఆపరేషన్..
కర్రి గుట్టల పై భారీగా మోహరించిన భద్రత బలగాలు..

ములుగు
ములుగు ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని కర్రి గుట్ట అటవీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రి గుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం తో సుమారు 3 వేల మంది పోలీసు భద్రత బలగాలు కర్రి గుట్ట అటవీ ప్రాంతాన్ని చుట్టూ ముట్టారు.అటు ఛత్తీస్ ఘడ్ లో వరుసగా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకుని తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తున్నారని ఈ నేపధ్యంలోనే మావోయిస్టులు కర్రి గుట్టల వైపు వచ్చారని పక్కా సమాచారంతో పోలీస్ భద్రత బలగాలు కర్రి గుట్టలను చుట్టి ముట్టారు.మరో పక్క మావోయిస్టులు ఇప్పటికే కర్రి గుట్టల చుట్టూ మందు పాత్రలు అమర్చినట్లు,ఆదివాసులు ఎవరు కూడా కర్రి గుట్టల వైపు వెల్ల వద్దని హెచ్చరికలు జారి చేశారు. అటు ఛత్తీస్ ఘడ్ పోలీసులు ,మరో వైపు తెలంగాణ పోలీసులు కర్రి గుట్టలను చుట్టూ ముట్టడం తో ఏ క్షణాన ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
పెద్దమ్మ గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం లో ఉద్రిక్తత..
కిరోసిన్ పోసుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం
![]()
భద్రాద్రి కొత్తగూడెం..ఏప్రిల్ 22..
పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిపాలక మండలి ప్రమాణ స్వీకారం వద్ద ఉద్రిక్తిత చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారాన్ని వద్దంటూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండల పరిధిలో జగన్నాధపురం లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి ఇటీవల కొత్త పాలక మండలి నియమించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు చేరో కమిటీని వేసుకున్నారు. ఈ కమిటీలు స్థానికేతరుడికి పెద్దమ్మ గుడి చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాణస్వీకారం జరిగే సమయంలో కూడా యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడే క్రమంలో ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేశారు. మళ్లీ అదే కార్యక్రమాన్ని మంగళవారం కొనసాగించే ప్రయత్నం చేయటంతో ప్రమాణ స్వీకారం వద్ద యువకులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసు బందోబస్తు నడుమ ప్రమాణ స్వీకారం జరిపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.. కాంగ్రెస్ లోనే రెండు వర్గాలు ఉండటంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది..
కర్రిగుట్టలో పోలీసుల మోహరింపు తొలగించాలి
ములుగు
ములుగు కర్రిగుట్టలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాల్పులను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఎన్కౌంటర్ జరిగిన దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఆయుధాలు పట్టుకున్నారనే నెపంతో ప్రజలను చంపేస్తారా. సంఘటనపై స్థానిక మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలి. అమిత్ షా ఆపరేషన్ లో భాగంగానే ఊసురులో, కర్రెగుట్టలో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికైనా బూటకపు ఎన్కౌంటర్ లు ఆపేయాలి. ఇప్పటికే జరిపిన పలు ఎన్కౌంటర్ లలో 14 మంది చనిపోయారు. ఇప్పటికే మోహరించిన బలగాలను తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకొని శాంతి చర్చలు జరపాలని అన్నారు.
