సంక్షిప్త వార్తలు:05-05-2025:ప్రసవమైన మహిళ కడుపులో వైద్యులు నిర్లక్ష్యంతో కాటన్ ప్యాడ్స్ మరిచిపోయారని సదరు బాలింత కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయస్థితిలో మహిళ వుందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘటన, గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ డెలివరీ సమయంలో వైద్యులు క్లాత్ అందులోనే వుంచి కుట్లు వేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
వడగళ్ల వర్షానికి పంట నష్టం
మెదక్ జిల్లా
మాసాయిపేట మండలం పోతాన్ పల్లి లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షానికి ఎకరా వరి పొలం పంట పంట నష్టం వాటిల్లిందని రైతు తలారి విజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నానని పూర్తిగా పంట నష్టం జరుగుతుందని ప్రభుత్వం అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
మహిళ కడుపులో కాటన్ ప్యాడ్స్
కమాపూర్ ఆసుపత్రిలో దారుణం

ప్రసవమైన మహిళ కడుపులో వైద్యులు నిర్లక్ష్యంతో కాటన్ ప్యాడ్స్ మరిచిపోయారని సదరు బాలింత కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాపాయస్థితిలో మహిళ వుందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘటన, గత వారం రోజుల క్రితం మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమల అనే మహిళ డెలివరీ సమయంలో వైద్యులు క్లాత్ అందులోనే వుంచి కుట్లు వేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం
ట్రాక్టర్, గడ్డివాము దగ్దం

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు కొత్తపల్లి రోడ్డు పై ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డివాము కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గడ్డివాము తో పాటు ట్రాక్టర్ దగ్దం అయింది. ప్రమాదాన్ని గ్రహించి డ్రైవర్ మరియు సహాయకులు తప్పించుకున్నారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసారు.
శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్దులను కొనసాగించాలి

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేట్ తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడాదరు. ఆంధ్రా ప్రదేశ్ లో సైనిక్ స్కూల్స్ లో 67 శాతం లోకల్ కోటా లో తెలంగాణ విద్యార్థులను తొలగించడం తో వేలాది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ లో సైనిక్ స్కూల్స్ ప్రారంభం అయ్యే వరకు తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రా లో లోకల్ కోటా ఉంచాలని ఫోన్ లో విజ్ఞప్తి చేసారు. మంగళవారం సాయంత్రం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలవనున్నారు. అప్పటివరకు తల్లిదండ్రులు సంయమనం తో ఉండాలని విజ్ఞప్తి చేసారు.
