Bhadrachalam: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోంది.వేసవి సెలవులు నేపథ్యంలో రాములవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మే నెల ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రామయ్య దర్శనానికి వచ్చిన భక్తుల పాదాలు మాత్రం నిప్పుల్లో నడుస్తున్నట్లు మారిన పరిస్థితులు నిశ్శబ్ద ఆవేదనగా మారాయి.
ఎండలకు అల్లాడిపోతున్న రామభక్తులు
భద్రాచలం
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోంది. వేసవి సెలవులు నేపథ్యంలో రాములవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మే నెల ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రామయ్య దర్శనానికి వచ్చిన భక్తుల పాదాలు మాత్రం నిప్పుల్లో నడుస్తున్నట్లు మారిన పరిస్థితులు నిశ్శబ్ద ఆవేదనగా మారాయి. దేవస్థానం పరిధిలో ప్రధాన మార్గాలలో కార్పెట్లు కేవలం పడమర మెట్ల నుండి అన్నదాన సత్రం వరకు మాత్రమే పరిమితం కావడంతో మిగిలిన మార్గాలలో భక్తులు కాలినడకన వెళ్లే సమయంలో తీవ్రమైన వేడి తాళలేక ఆగిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసాదాల కౌంటర్ నుండి, అన్నదాత సత్రం అక్కడి నుండి పడమర మెట్లు వరకు నడవవలసిన భక్తులు కాలినడక నిప్పుల మీద నడుస్తున్నట్లు బాధను అనుభవిస్తున్నారు. మట్టి నేల, రాళ్లు, టైల్స్, అన్ని ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ఈ వేడి నడకను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం అధికారులు ఇప్పటికే కొంత మేరకు కార్పెట్లు వేసినప్పటికీ పూర్తి మార్గంలో ఏర్పాటు చేయాలని భక్తులు వేడుకుంటున్నారు.
Read more:Andhra Pradesh:వాతావరణం.. కోస్తాలో ఓలా.. రాయలసీమలో మరోలా
