సంక్షిప్త వార్తలు : 12-05-2025:తిరువూరులో తిరువూరు డివిజన్ స్థాయి “ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్ లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని),, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవ దత్తు, జిల్లా అధికారులు పాల్గోన్నారు.
సమస్యల పరిష్కార మార్గం చూపిస్తున్నా

తిరువూరు
తిరువూరులో తిరువూరు డివిజన్ స్థాయి “ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పబ్లిక్ గ్రీవెన్స్ లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని),, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవ దత్తు, జిల్లా అధికారులు పాల్గోన్నారు. ఎంపి మాట్లాడుతూ ప్రజల దగ్గర నుండి నేరుగా అర్జీలను స్వీకరిస్తూ సమస్యలను క్షుణ్ణంగా జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలిస్తూ పరిష్కార మార్గం చూపుతున్ననని అన్నారు.
ఆస్తి పన్ను తగ్గించాలి
సీపీఐ ధర్నా

కడప
ప్రజలకు నడ్డివిరిచే విధంగా ఆస్తి పనులను పెంచే విధానాన్ని రద్దు చేయాలని కడపలో సీపీఐ మునిసి పల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన ఆస్తి పనులను కౌన్సిల్లో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాన్ని వెంటనే వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేశారు. ప్రజల నడ్డివిరిచే విధంగా ఆస్తి పనులతో భారం ప్రజలపై పడుతుందన్నారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

కాకినాడ
కూటమి ప్రభుత్వంలోమహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ,వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చా ర్జి వంగా గీత పేర్కొన్నారు..కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు,చిన్నారులపై అత్యాచారాలు, దాడులు జరు గుతున్నా ఎటువంటి రక్షణా లేదని అన్నారు. మాజీ మహిళా మంత్రి అనే గౌరవం కూడా లేకుండా విడదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి, చేయి చేసుకోవడం దారుణమని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని మండిపడ్డారు..
కించపరచినందుకు మహిళ ఆత్మహత్య

నందిగామ
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించే భాగంలో ఓ మహిళను కించపరుస్తూ పదిమందిలో అమర్యాదగా మాట్లాడటం తో మనస్థాపానికి గురైన చందర్లపాడు మండలం(విభరింతలపాడు)సంగళ్లపాలె నికి చెందిన అబ్బూరి మాధురి పురుగుమందు సేవించే ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఇద్దరు పిల్లల బాధ్యత ఎమ్మెల్యే సౌమ్య అక్క తీసుకోవాలని కోరుతూ తనకు జరిగిన పరాభవం గురించి వీడియో రికార్డు ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఆమె సూసైడ్ వీడియోను విడుదల చేసింది. గ్రామంలో పనికి ఆహార పథకం నిర్వహించే వ్యక్తి పేరును ఆమె వివరించింది. తను బలన్మర్మానికి పాల్పడటానికి కారణం అతనేనని వీడియో ద్వారా తెలిపింది..
