సంక్షిప్త వార్తలు : 14-05-2025

eeroju Daily news website

సంక్షిప్త వార్తలు : 14-05-2025:రాష్ట్రపతి భవన్‌ లో బుధవారం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా  జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్ర  మానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం.. - ANN  Telugu
న్యూ ఢిల్లీ,
రాష్ట్రపతి భవన్‌ లో బుధవారం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా  జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్ర  మానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు.

జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ రికార్డులకెక్కారు. జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అమరా వతిలో జన్మించారు. 1985 లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదుల తో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మునిసిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు.

వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవం
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సతీమణి తులసిమ్మ

మే 4 నుంచి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు - Vishwa Samvad Kendra  Andhra Pradesh
బద్వేలు నియోజకవర్గ పోరుమామిళ్ల రంగసముద్రం పంచాయతీలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో వెలిసిన  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి  గోవిందమాంబ వారి దేవాలయ దేశము వార్షికోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి  వారి సతీమణి తులసిమ్మ  పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ  దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి , రంగసముద్రం వైస్ సర్పంచ్ రుద్రవరం ప్రసాద్  జగన్మోహన్ ఆచారి, శ్రీనివాసులు ఆచారి, బాలుడు ఆచారి, ఆలయ కమిటీ సభ్యులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ శివరామ నంద సరస్వతి స్వామిని కలిసిన బద్వేలు సర్పంచులు మున్సిపల్ కౌన్సిలర్లు

Mahapurush Maharaj Swami Shivananda - YouTube
శ్రీ శ్రీ శ్రీ  శివరామానంద సరస్వతి స్వామి ( బద్వేల్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణ రావు ) వారిని బద్వేల్ మండలము బద్వేల్ మున్సిపాలిటీకి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, బద్వేల్ మండల ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్చార్జులు, తదితరులు  బుధవారం పోరుమామిళ్ళ వారి నివాసం నందు  మర్యాదపూర్వకముగా కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగినది. ఈ సందర్భముగా బద్వేల్ నియోజకవర్గ రాజకీయ స్థితిగతుల గురించి కూడా స్వామివారికి వివరించడం జరిగినది.

*శ్రీ శ్రీ శ్రీ శివరామానంద సరస్వతి స్వామి వారిని బద్వేల్ మండలము మరియు బద్వేల్ మున్సిపాలిటీకి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, బద్వేల్ మండల ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్చార్జులు, తదితరులు  పోరుమామిళ్ళ వారి నివాసం నందు మర్యాదపూర్వకముగా కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగినది. ఈ సందర్భముగా బద్వేల్ నియోజకవర్గ రాజకీయ స్థితిగతుల గురించి కూడా స్వామివారికి వివరించడం జరిగినది

Related posts

Leave a Comment