Bachupalli : బాచుపల్లి.. పూర్తయ్యేది ఎప్పుడూ

Bachupalli.

Bachupalli : మియాపూర్ నుండి బొల్లారం వరకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడానికిహైదరాబాద్‌లోని బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. పరిపాలనాపరమైన అడ్డంకులు, యుటిలిటీ బదిలీ, నిధుల కొరత కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది.

బాచుపల్లి.. పూర్తయ్యేది ఎప్పుడూ..

హైదరాబాద్, జూన్ 4
మియాపూర్ నుండి బొల్లారం వరకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడానికిహైదరాబాద్‌లోని బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. పరిపాలనాపరమైన అడ్డంకులు, యుటిలిటీ బదిలీ, నిధుల కొరత కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లి ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడానికి ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి చాలా సమయమే తీసుకునేలా ఉంది.ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోందని, ఆఫీసులకు వెళ్లాలన్నా, రావాలన్నా చాలా సమయం తీసుకుంటూ ఉందని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్ భరించలేని విధంగా మారిపోయిందని, ఫ్లైఓవర్ పూర్తవ్వడం కోసం సంవత్సరాలుగా వేచి ఉన్నామని నిజాంపేట నివాసితులు చెబుతున్నారు. ఫ్లై ఓవర్ పని నిర్మాణం చాలా నెమ్మదిగా సాగుతూ ఉందని, ఎప్పటికీ అంతం కానిదిగా అనిపిస్తుందని స్థానిక మెకానిక్ శివ అన్నారు.

ఎన్నికల కారణంగా కూడా నిర్మాణం ఆలస్యమైందని, ఇకనైనా వేగంగా పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగి విష్ణు చెప్పారు.  బాచుపల్లి, మల్లంపేట, నిజాంపేట ప్రాంతాల ప్రయాణికులు రద్దీ సమయాల్లో ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇరుకైన మళ్లింపులు, కొన్ని సార్లు వాహనాలు బ్రేక్‌డౌన్‌ అవ్వడం సమస్యను మరింత తీవ్రం చేస్తుంటాయి. నిర్మాణ స్థలంలోని చాలా చోట్ల సరైన బారికేడ్లు, సూచికలు లేవని తెలుస్తోంది. ఇక జాప్యానికి ప్రధాన కారణం భూసేకరణ అని కూడా స్థానికులు చెప్పారు. అందుకోసమే రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని, అలైన్‌మెంట్‌లోని అనేక ఆస్తులకు క్లియరెన్స్ అవసరం ఉండడంతో సుదీర్ఘమైన చట్టపరమైన ఫార్మాలిటీలు నిర్మాణ సమయాన్ని పొడిగించాయి. నీటి పైపులైన్ల పనులకు కూడా మరో మూడు నెలలు సమయం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కారణంగా విద్యుత్ స్తంభాల తరలింపు మరింత వాయిదా పడింది. ఈ దశలో విద్యుత్తు అంతరాయం ఎన్నికల కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఎన్నికల సీజన్ లో విద్యుత్ మౌలిక సదుపాయాలను పట్టించుకోకపోవడంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ఇలా ఎన్నో కారణాల వలన బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవ్వడం ఆలస్యమవుతూనే వస్తోంది.

Read more:Ration cards : గ్రేటర్ రేషన్ కార్డుల దందా

Related posts

Leave a Comment