KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత

KTR Slams Congress Government Over Unfulfilled Promises in Telangana

KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత:హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట.

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని ఆయన దుయ్యబట్టారు. “ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా అన్నాడట.. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉంది” అంటూ కేటీఆర్ X (ట్విట్టర్) వేదికగా వ్యంగ్యంగా విమర్శించారు.

హామీల అమలుపై ప్రశ్నల వర్షం

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టిన పలు హామీలను కేటీఆర్ ప్రశ్నించారు

1.ఇస్తున్న రైతుభరోసా సరే, మరి ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతేంటి?”

2.ఎగ్గొట్టిన వడ్ల బోనస్ పరిస్థితి ఏంటి?”

3.ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి హామీ ఏమైంది?”

4.ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి?”

5.ఎగ్గొట్టిన రూ. 2500 మహాలక్ష్మి పథకం ఏమైంది?”

6.ఆడబిడ్డలకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీల సంగతి ఏంటి?”

7.ఆగిపోయిన రైతుబీమాను ఎప్పుడు పునరుద్ధరిస్తారు?”

8.ఆగిపోయిన రుణమాఫీని ఎప్పుడు అమలు చేస్తారు?”

కాంగ్రెస్ కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తోంది: కేటీఆర్

శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, లోక్‌సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు. “మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ధ.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే” అని కేటీఆర్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

Read also:KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపులు

 

Related posts

Leave a Comment