Lokesh : లోకేశ్ ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో కీలక భేటీ:ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను లోకేశ్ కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేశ్ భేటీ
ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను లోకేశ్ కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. అమిత్ షాతో సమావేశం అనంతరం లోకేశ్ మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాసవాన్, అర్జున్‌రామ్ మేఘ్వాల్‌లను ఆయన కలవనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా లోకేశ్ ఈరోజు ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read also:Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్: రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యం
