Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు:తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణ శాఖ అంచనా ప్రకారం, గురువారం (జూలై 3, 2025) ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణ శాఖ అంచనా ప్రకారం, గురువారం (జూలై 3, 2025) ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శుక్రవారం (జూలై 4, 2025) ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉండవచ్చని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read also:Aadhaar : బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి కాదు: బాంబే హైకోర్టు కీలక తీర్పు
