Kavitha : బీసీ రిజర్వేషన్లపై కవిత ప్రశ్నలు: రేవంత్ రెడ్డిని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తున్న కవిత నిన్న తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, ఇతర బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
కవిత పోరాటం: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కార్యాచరణ ప్రకటన
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తున్న కవిత నిన్న తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, ఇతర బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు ఎందుకు తీసుకువెళ్లలేదని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తోందని ఆమె విమర్శించారు. త్వరలోనే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాట కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కలిసివచ్చే అన్ని వర్గాలతో కలిసి పోరాడతామని చెప్పారు. కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ అమలు చేయకుండా బీసీలను వంచిస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అంటే, బీసీ రిజర్వేషన్లు ఇప్పటికి అమలు చేయబోమని చెప్పడమేనని ఆమె అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిని మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందు ఎండగడతామని చెప్పారు. పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కేవలం కంటితుడుపు చర్యేనని ఆమె పేర్కొన్నారు.
Read also:StockMarket : మార్కెట్లు జోరు: రియాల్టీ, ఆటో షేర్ల మద్దతుతో సూచీలు పరుగులు
