NaraLokesh : ఏపీ యువతకు విదేశాల్లో ఉద్యోగాల కోసం శిక్షణ, డేటా సిటీకి కేంద్ర సహకారం కోరిన మంత్రి లోకేశ్

Minister Lokesh Asks for Central Support for Training AP Youth for Foreign Jobs and for Data City

NaraLokesh : ఏపీ యువతకు విదేశాల్లో ఉద్యోగాల కోసం శిక్షణ, డేటా సిటీకి కేంద్ర సహకారం కోరిన మంత్రి లోకేశ్:విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని, దీంతోపాటు విదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు.

ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి

విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని, దీంతోపాటు విదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు. ఈ రోజు న్యూఢిల్లీలో జైశంకర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధి జరిగితే, భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్‌గా మారుతుందని, దీనికి కేంద్రం సహకారం అవసరమని చెప్పారు. వలస కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ‘ప్రవాస భారతీయ బీమా యోజన’ వంటి పథకాలను విస్తరించాలని, దీనికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని నారా లోకేశ్ కోరారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో జరిగిన వివిధ అంశాలపై లోకేశ్ జైశంకర్‌కు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు, వివిధ రంగాల్లో భాగస్వామ్యం గురించి వివరించి, కేంద్ర సహకారం కోరారు.

సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారని, వీరిలో అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ఉన్నారని లోకేశ్ తెలిపారు. యూఎస్‌లో అక్కడి ప్రజల తలసరి ఆదాయం $70,000 ఉండగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం $126,000 ఉందని చెప్పారు.

ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్‌లతో మొబిలిటీ, మైగ్రేషన్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్స్ (MMPA) ఏర్పాటు చేయడంపై కేంద్రం తీసుకున్న చర్యలు అభినందనీయమని లోకేశ్ అన్నారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ఏపీ పూర్తి మద్దతు ఇస్తుందని, కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి రాష్ట్రం చురుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్, సంస్థాగత భాగస్వామ్యాల కోసం ఏపీ ప్రభుత్వం చురుగ్గా కృషి చేస్తోందని, రష్యా, ఆస్ట్రేలియాతో కలిసి జాయింట్ ట్రైనింగ్, అసెస్‌మెంట్‌పై పనిచేస్తున్నామని లోకేశ్ వివరించారు. త్వరలో ‘నైపుణ్యం’ పోర్టల్‌ను ప్రారంభించనున్నామని, ఇది యువతకు, పారిశ్రామిక సంస్థలకు మధ్య వారధిగా ఉంటుందని తెలిపారు. మెరుగైన విదేశీ ఉద్యోగాల కోసం జపాన్, కొరియా, తైవాన్‌లతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ అరేంజ్‌మెంట్ (MMPA) పై దృష్టి సారించామని వివరించారు. ఏపీ యువతకు మెరుగైన అవకాశాల కల్పన కోసం కేంద్రం నుంచి డేటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా జైశంకర్‌ను కోరారు.

Read also:GSTCut : వాహనాల ధరలు తగ్గుదల

 

Related posts

Leave a Comment