Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గుప్త నిధుల కోసం బాలుడి బలికి యత్నం

0

విజయవాడ,ఫిబ్రవరి 13,
ఎన్టీఆర్‌ జిల్లాలో కలకలం రేగింది. గుప్త నిధుల పేరుతో ఓ  బాలుడినే బలి ఇచ్చేందుకు యత్నిస్తున్నారన సమాచారం అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూఢత్వాలతో కొందరు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కోట్ల విలువైన నిధులు వస్తాయని నమ్మి పాపాలకు పాల్పడుతున్నారని మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లి గ్రామంలో అర్థరాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు వణికిపోయారు. ధైర్యం చేసిన కొందరు గ్రామస్థులు తిరువూరు మండలం టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల సరిహద్దుల వద్దకు వెళ్లారు. గ్రామస్తులు వెళ్లేసరికి అక్కడ కొంతమంది గుంపుగా నిలబడి ఉన్నారు. వాళ్లను పరిశీలిస్తే… వారితో పూజారులు, ఓ బాలుడు కూడా ఉన్నాడు. అంతేకాదు.. ఆబాలుడి తండ్రి కూడా గుంపులో ఉన్నాడు.

ఎందుకు వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు. బాలుడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు పోన్ చేశారు. బాలుడిని నరబలి ఇచ్చేందుకు తీసుకొచ్చారని… వెంటనే రావాలని సమాచారం అందించారు. ఖాకీలు వచ్చి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.గుప్త నిధుల కోసమే ఎనిమిది మంది సభ్యుల గుంపు వచ్చిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీళ్లంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులని చెబుతున్నారు. మొత్తం 8మంది గుప్తనిధుల ముఠాలో నలుగురు పారిపోయారని తెలిపారు. నలుగురు మాత్రమే తమకు చిక్కారని వారిని పోలీసులకు అప్పగించినట్టు వివరించారు. బాలుడిని అడిగితే ఏవో పూజలు అన్నాడని గ్రామస్థులు తెలిపారు.

తన తండ్రే పిలిస్తే తాను అక్కడకు వచ్చానంటూ బాలుడు ఏడుస్తూ చెప్పిన విషయం వీడియోలో ఉంది. తను ఏ తప్పు చేయలేదని బాలుడు వివరించాడు. ఓ కారు మూడు బైక్‌లలో ఈ ముఠా వచ్చినట్టు చెబుతున్నారు గ్రామస్థులు. వాళ్లు అనున్న ప్లాన్ వర్కౌట్‌ అయితే వెళ్లిపోవడానికి ఆ వెహికల్స్‌ను రెడీ చేసినట్టు చెబుతున్నారు. ఓ దిక్కున కారు, బైక్‌, మరో మూలన రెండు బైక్స్‌ ఉంచినట్టు పేర్కొన్నారు. గ్రామస్థులు తమను గమనించారని గ్రహించిన ముఠాలోని నలుగురు సభ్యులు రెండు బైక్స్‌ వేసుకొని పరారైనట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie