Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తిరుమలలో భారీగా చిరుతలు, ఎలుగుబంట్లు

Another Leopard and Bear spotted at Tirumala Alipiri footpath

0

శేషాచలం కొండలు దేశంలోనే అతిపెద్ద అడవుల్లో మూడో స్థానంలో ఉంది. కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సుమారు 8 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో శేషాచలం కొండలు విస్తరించి ఉన్నాయి.. ఈ కొండల్లోనే తిరుమల శ్రీవారి ఆలయం ఉంది. ఏడుకొండలుగా పిలువబడే గరుడాద్రి, శేషాద్రి, వృషబాద్రి, నీలాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి కొండలు శేషాచలం అడవుల్లో భాగమే.. ఈ సప్తగిరులపైనే శ్రీవారు కొలువై ఉన్నారు. ప్రపంచంలోనే అరుదైన జీవజంతుజాలంతో పాటు, అరుదైన వృక్ష సంపద ఈ శేషాచల కొండల ప్రత్యేక. ఇవే కాక ప్రమాదకరమైన వన్యమృగాలకు కూడా శేషాచలం కొండలు ఆవాసంగా ఉన్నాయి. ఈ కొండల్లో చిరుతలు, ఎలుగుబంట్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో ఘాట్ రోడ్డు మార్గంలో భక్తులకు తరసపడ్డ చిరుతలు, ఎలుగుబంట్లకు సంబంధించిన వీడియోలు మాధ్యమాల్లో అనేక సార్లు చూసే ఉంటారు.

Also Read: రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు Rains in the state for two days

ఇక ఇటీవల శ్రీవారి భక్తులపై దాడులకు పాల్పడిన ఘటనలు ఇప్పుడు భక్తుల్లో ఆందోళనలను పెంచాయి. కాలినడకన వెళ్లే భక్తులపై ఇటీవల జరిగిన రెండు దాడుల గురించి తెలిసిందే.. నెల రోజుల క్రితం కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచిన ఘటన.. పది రోజుల క్రితం లక్షిత అనే బాలిక చిరుత దాడిలో మృతి చెందిన ఘటన తర్వాత శేషాచలం అడవుల్లో పులుల సంచారంపై మరింత ఆందోళన పెరిగింది.. బాలికపై దాడి ఘటన తర్వాత టిటిడి కాలినడక మార్గాల్లో 320 కి పైగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది.. 36 బోన్లు కూడా ఏర్పాటు చేయగా 50 రోజుల వ్యవధిలోనే 3 చిరుతలు చిక్కాయి.. అలాగే ఏర్పాటు చేసిన కెమెరాల్లో మరో మూడు చిరుతల సంచారం ఉన్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే మూడు పట్టుబడగా.. మరో 3 చిరుతల సంచారాన్ని గుర్తించారు. చిరుతలే అనుకుంటే ఇటీవల ఒక ఎలుగుబంటి కూడా పదే పదే భక్తులు వెళ్లే మార్గంలో సంచరిస్తూ కలవర పెడుతోంది.

Leopards and bears abound in Tirumala footsteps

ముప్పు తిప్పలు పెడుతున్న ఎలుగుబంటి
టీటీడీ సిబ్బంది.. ఫారెస్ట్‌ అధికారుల ఎఫర్ట్స్‌ ఫలించాయి. తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోన్లకు చిరుత చిక్కింది. అయితే ఒక చిరుత కాదు… నడక మార్గంలో మరో 3 చిరుతలు ఉన్నాయని భయపెడుతుండగా.. ఇప్పుడు కొండపై మరో భయం వెంటాడుతోంది. శ్రీవారి భక్తులకు ఎలుగుబంటి భయం వణికిస్తోంది. తిరుమల కొండల్లో వన్యమృగాల భయం శ్రీవారి భక్తులను భయపెడుతోంది.. అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు అనేక సందర్భాల్లో ఎలుగుబంటి తారసపడింది. నిత్యం తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గం ద్వారా భక్తులు నడిచి తిరుమలకు చేరుకుంటుంటారు. సాధారణ రోజుల్లో కాలినడకన తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య ఇరవై నుంచి ఐరవై ఐదు వేల వరకు ఉంటుంది..వారాంతంలో అయితే ఈ సంఖ్య ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో అయితే కాలినడకన కొండకు చేరుకునే భక్తుల సంఖ్య నలభై వేలు దాటుతుంది. ఇటీవల కాలంలో నడిచి వెళ్లే మార్గంలో వన్యమృగాల సంచారం మరింత ఎక్కువైంది. ఓ వైపు చిరుతలు భయపెడుతుంటే.. ఇప్పుడు మరో భయం వెంటాడుతోంది. ఈ సమాచారం తెలిసినప్పటి నుంచి భక్తుల్లో భయం పెరిగింది.. ఇటీవల ఎలుగుబంటి సంచారం భక్తుల్లో భయాన్ని పెంచింది.శ్రీవారి మెట్టు, ఏడో మైలు ప్రాంతంలో తరచూ ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డాయ్యాయి.

Also Read: నిపోయిందెవరు? No clarity on Maoist leader Malla Rajireddy death

భక్తులు కూడా చాలా సార్లు ఎలుగుబంటి కనిపించిన విషయాన్ని టీటీడీ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. కొంతమంది భక్తులు మొబైల్ ఫోన్లో కూడా ఎలుగుబంటిని ఫోటోలు తీశారు.. భక్తులు అందించిన సమాచారంతో టీటీడీ ఆపరేషన్ బంటి కార్యక్రమం చేపట్టింది.ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది టిటిడి. ఇందుకోసం 25 మంది సిబ్బందిని ఇప్పటికే నడకదారిలో ఏర్పాటు చేసింది. ఎలుగుబంటిని బందించేందుకు ప్రత్యేక బోన్లు, వలలతో ఆపరేషన్ మొదలు పెట్టింది. రెండు సార్లు వలలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది బంటిపట్టుకోవడం మీపనైతే.. తప్పించుకోవడం నాకు తెలుసంటూ చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతోంది ఎలుగుబంటి.. ఎక్కడైతే బంటిని బందించేందుకు ఏర్పాట్లు చేశారో అక్కడే ధైర్యంగా తిరుగుతోంది. భక్తులను ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

Leopard in Tirumala

దీంతో ఎలాగైనా ఎలుగుబంటిని బందించాలని టీటీడీ ఇందుకోసం అదనంగా మరో బృందాన్ని కూడా రంగంలోకి దించుతోంది. శ్రీవారి భక్తుల్లో భయాన్ని నింపిన ఎలుగుబంటి ఎప్పుడు చిక్కుతుందో చూడాలి మరి.ఇదిలావుంటే, భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. నడకదారిలో సాధుజంతువులకు కూడా ఎలాంటి ఆహారం ఇవ్వొద్దని… ఇస్తే చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. వ్యర్థ పదార్థాలను షాపుల బయట వదిలేసేవారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది. భద్రత కోసం డ్రోన్లు కూడా వాడాలని నిర్ణయించింది. 30 మీటర్లు దూరం కనపడేలా మెట్ల మార్గంలో ఫోకస్‌ లైట్లతో పాటు 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా గతంలో టీటీడీ తెలిపింది. నడకదారిలో ప్రమాదాలపై భక్తులకు అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డ్స్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి భద్రతపై భక్తులకు కల్పిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie