A place where you need to follow for what happening in world cup

HOT NEWS

‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని

natural star nani Dussehra Blockbuster Dawat

0

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్ననేపధ్యంలో కరీంనగర్ లో ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు బిఎండబ్ల్యు కారుని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అలాగే దసరా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్ ని కానుకగా ఇచ్చారు.

దసరా బ్లాక్ బస్టర్ దావత్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. దసరా సినిమాని ఇంతపెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమా ఇంకా మొదలుకాకముందు ‘’నాని అన్న లాంటి యాక్టర్ కి వంద కోట్ల పోస్టర్ చూడాలని కోరికగా వుంది’’అని శ్రీకాంత్, మా కో డైరెక్టర్ వినయ్ తో అన్నాడు. ఆ కోరిక ఈ వేదికపై తీరింది. ఈ వేడుక కరీంనగర్ లో జరగడం మా అందరికీ మెమరబుల్. దసరాని థియేటర్ లో ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మేము చూశాం. మా కడుపునిండిపోయింది. నేను నాకు తోచింది మనసుకు నచ్చింది చేస్తూ వచ్చాను. ఈ ప్రోసస్ లో నిరాశ పరిచిన వారు కూడా కొంతమంది వుంటారు. కానీ బలంగా నమ్మి మనస్పూర్తిగా దిగిపోయేవాడిని. నేను అలా దిగిపోయిన ప్రతిసారి మీరు సపోర్ట్, విజయాలు ఇచ్చి ఇంత గొప్పగా ప్రోత్సహిస్తుంటే ఆ నమ్మకం పదింతలైపోయింది. మీ అందరికీ కలలు వుంటాయి. మీరు నమ్మితే బలంగా దిగండి. వెనక్కి లాగే వాళ్ళ కోసం పట్టించుకోవద్దు. ప్రాణం పెట్టి పని చేయండి. మీ కలలు తప్పకుండా నెరవేరుతాయి.

మీడియా,  సోషల్ మీడియాలో ఒక కొత్త సినిమా విడుదలౌతుంటే ఇది బాగా ఆడితే బావుటుందని అనుకునే వారి కంటే, ఇది ఆడదని అనే వాళ్ళే ఎక్కువ వున్నారు. వాళ్ళందరిది తప్పు అని నిరూపించాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద ఈ రోజు మంచి గెలిచింది. మన దసరా అనే మంచి గెలిచింది. దసరా అంటేనే చెడు మీద మంచి గెలవడం. ఈ రోజు ఆ వేడుక కరీంనగర్ లో జరుపుకుంటున్నాం. ఈ గెలుపు శ్రీకాంత్ ఓదెలది, సుధాకర్ చెరుకూరిది, సంతోష్ నారాయణది, నవీన్ నూలిది, అవినాస్ ది, దసరా టీంలో పని చేసిన అందరిదీ, ఈ గెలుపు ప్రేక్షకులందరిది. మీరంతా ఇంత గొప్పగా ఆదరించకపోయి వుంటే మేము పెట్టిన కష్టానికి ఫలితం వుండేది కాదు. మరోసారి ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దసరా ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విజయం. మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మంత్రి గంగులకమలాకర్ గారికి కృతజ్ఞతలు. దసరాకి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. మహేష్ బాబు గారు, ప్రభాస్ అన్న, రాజమౌళి గారు, సుకుమార్ గారు.. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది దసరా గురించి గొప్పగా పోస్టులు పెట్టి మీ అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మరోసారి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని ఇదివరకే కలిశాను. తను చాలా ప్రతిభావంతుడు. దసరాని చాల గొప్పగా తీశాడు. నాని దసరాతో మా తెలంగాణ బిడ్డగా మారిపోయాడు. తెలంగాణ ఎంతో మంది కళాకారులకు నిలయం. భవిష్యత్ లో మరింత మంది తెలంగాణ నుంచి గొప్ప కళాకారులు వస్తారు. నిర్మాత సుధాకర్ తెలంగాణ సంస్కృతి మీద గొప్ప సినిమా తీశారు. దసరా యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు’’ తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. దసరాని ఇంతపెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ వేడుకకు వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు. దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ దసరాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత పెద్ద సినిమాలో అవకాశం ఇచ్చిన నాని గారికి దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తెరపై సూరి పాత్రని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ ఆదరణకు కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ వేడుకలో కాసర్లశ్యామ్, దసరా గ్యాంగ్, దసరా టీం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.