రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ జనచైతన్య లేఔట్‌లో 4 పార్కుల స్థలాలకు విముక్తి మొత్తం 19,878 గజాల స్థలం కబ్జా నుంచి విడిపింపు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసిన వారికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) గట్టి షాక్ ఇచ్చింది. రాజేంద్రనగర్ పరిధిలో ఏకంగా రూ. 139 కోట్లకు పైగా విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ ఉదయం ఒక భారీ ఆపరేషన్ నిర్వహించి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. వివరాలు: రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాలలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో హుడా (HUDA) ఆమోదంతో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2 లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ లేఅవుట్‌లో ప్రజల అవసరాల కోసం కేటాయించిన నాలుగు…
Read MoreTag: #DemolitionDrive
HYDRA : హైడ్రా కూల్చివేతలు: దసరా తర్వాత కొండాపూర్ బిక్షపతి నగర్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్ కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో హైడ్రా కూల్చివేతలు దసరా పండుగ ముగిసిన మరుసటి రోజే అధికారుల చర్యలు ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలంటూ ఇళ్ల తొలగింపు నగరంలో మరోసారి కూల్చివేతలు కలకలం సృష్టించాయి. దసరా పండుగ ముగిసిన మరుసటి రోజు, శనివారం తెల్లవారుజామున, కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో హైడ్రా (HYDRA) అధికారులు నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారనే కారణంతో అక్కడ ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయాన్నే భారీ పోలీసు బందోబస్తుతో హైడ్రా అధికారులు బిక్షపతి నగర్‌కు చేరుకున్నారు. బుల్డోజర్లు, ప్రొక్లెయినర్ల సహాయంతో నిర్మాణాలను వేగంగా తొలగించడం మొదలుపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కూల్చివేతలు జరుగుతున్న…
Read More