Hyderabad : హైదరాబాద్‌లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి… రూ.15 వేల కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

HYDRA Demolishes Illegal Ventures on 317 Acres of Government Land in Gajularamaram

గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారు రూ.15 వేల కోట్లు ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు, రియల్టర్లు, అధికారుల హస్తం హైదరాబాద్‌లోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, గాజులరామారంలో దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు, రియల్టర్లు, కొందరు ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న ఈ అక్రమాలకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అడ్డుకట్ట వేసింది. గత ఆరు నెలలుగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా లోతైన విచారణ జరిపింది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు తీసుకుంది. గాజులరామారంలోని సర్వే నంబర్ 307 సహా ఇతర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను, లేఅవుట్లను…

Read More