లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం… గుంటూరు, అక్టోబరు 1, (న్యూస్ పల్స్) Nara Lokesh నారా లోకేష్ పై కీలక బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యత పెరిగింది. అటు ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నవేళ లోకేష్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున వీలైనంతవరకు.. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులు సైతం సమన్వయం చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీ వెళ్లి పెద్దలను కూడా కలిశారు. అయితే ఇదంతా పక్క వ్యూహంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంపై చర్చించడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు…
Read MoreTag: Guntur
చేగువేరా నుంచి సనాతనధర్మం పరిరక్షకుడు… పవన్ ట్రాన్స్ ఫార్మేషన్ ఇలా… | Eeroju news
చేగువేరా నుంచి సనాతనధర్మం పరిరక్షకుడు… పవన్ ట్రాన్స్ ఫార్మేషన్ ఇలా… గుంటూరు, సెప్టెంబర్ 25, (న్యూస్ పల్స్) పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక చేగువేరా. తనలోని ఒక చేగువేరా ఒక కమ్యూనిస్టు,ఒక బహుజన సానుభూతిపరుడు ఉన్నాడని జన సైనికులు భావించేవారు.పవన్ చర్యలు కూడా అలానే ఉండేది.ఆయన నటించిన సినిమాల్లో సైతం కమ్యూనిస్టు భావజాలాన్ని చూపించేవారు.తాను సినిమాల్లోకి రాక పోయి ఉంటే అడవుల్లో అన్న అయి ఉండేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు పవన్. అంతలా పెనవేసుకుపోయింది కమ్యూనిజంతో ఆయన బంధం. అయితే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు అంటూ పవన్ కళ్యాణ్ కొత్త పంధాను ఎంచుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు కమ్యూనిస్టుగా ఉన్న పవన్ ఆధ్యాత్మిక వేత్తగా ఎందుకు మారారు? సమాజ అవసరం కోసం మారారా? లేకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మారారా? అన్నది…
Read MoreCM Chandrababu and Jagan | లడ్డూ వ్యవహారంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ … | Eeroju news
లడ్డూ వ్యవహారంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ … గుంటూరు, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్) CM Chandrababu and Jagan తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లుగా రాజకీయం మారుతోంది. టీటీడీ బోర్డు స్వతంత్రంగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాలు బోర్డే చూసుకుంటుంది… అని స్వయంగా సీఎం జగన్ ప్రెస్ మీట్‌లో చెప్పినా.. నెయ్యి కల్తీ వ్యవహారమంతా గత ప్రభుత్వం తప్పే అన్నట్లుగా ఇతర పార్టీలన్నీ ప్రొజెక్ట్ చేశాయి. వైసీపీ దాన్ని తిప్పికొట్టలేకపోయింది. తప్పు చేయలేదని బలంగా వాదించలేకపోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాత్రం అంటున్నారు. ఈ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లెక్కి ఎవరూ ధర్నాలు చేయడం లేదు కానీ..ఉత్తరాదిలో మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. హిందూత్వ రాజకీయాలు దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిన ఎక్కువగా ఉంటాయి. తిరుమల అనేది ఉత్తరాది హిందూ…
Read MoreVidadala Rajini | విడుదల రజనీ అరెస్ట్ తప్పదా | Eeroju news
విడుదల రజనీ అరెస్ట్ తప్పదా గుంటూరు, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) Vidadala Rajini వైసీపీ నేతలకు కష్టాలు వెంటాడుతున్నాయా? ఈ జాబితా మరింత పెరిగే అవకాశముందా? తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ కూడా అందులో చేరిపోయారా? రేపో మాపో రజనీ అరెస్ట్ తప్పదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.గడిచిన ఐదేళ్ల కాలం వైసీపీ స్వర్ణయుగం. ముఖ్యంగా నేతలకు కూడా. ఎందుకంటే బెదిరింపులు, దందాలకు పాల్పడినట్టు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారడంతో బాధితులు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీ వంతైంది. ఆమె పేరిట బంధువులు వసూళ్ల దందాపై విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత.పల్నాడు జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తు కొచ్చేది స్టోన్ క్రషర్ బిజినెస్. అక్కడ ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. దీన్ని…
Read MoreExcise again in place of Seb | సెబ్ స్థానంలో మళ్లీ ఎక్సైజ్ | Eeroju news
సెబ్ స్థానంలో మళ్లీ ఎక్సైజ్ గుంటూరు, ఆగస్టు 21 (న్యూస్ పల్స్) Excise again in place of Seb ఏపీలో ఐదేళ్ల క్రితం సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోల ప్రహసనానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకాలని నిర్ణయించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పోలీస్ శాఖల నుంచి సిబ్బందిని కలిపి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. మొదట్లో మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాటు సారా తయారీ నిరోధం, గంజాయి సాగు, రవాణాలను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటైన సెబ్‌ను తర్వాత ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాలకు కూడా విస్తరించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించింది. మద్యం విక్రయాలను కట్టడి చేసే…
Read MoreGreetings from Chief Minister Chandrababu on the occasion of World Photography | వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు | Eeroju news
వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం గుంటూరు Greetings from Chief Minister Chandrababu on the occasion of World Photography వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో…
Read MoreUnexpected change in jagan… | జగన్ లో ఊహించని మార్పు… | Eeroju news
జగన్ లో ఊహించని మార్పు… గుంటూరు, ఆగస్టు 8, (న్యూస్ పల్స్) Unexpected change in jagan… వైసీపీ అధినేత జగన్ కొత్త ప్లాన్ ఏంటి? చంద్రబాబు సర్కార్‌ను ఇబ్బందిపెట్టడమేనా? జగన్ వేసిన కొత్త పాచికలు వర్కవుట్ అయ్యేనా? మళ్లీ బూమరాంగ్ అయ్యేనా? జగన్ ఎత్తుకు సీఎం చంద్రబాబు పైఎత్తు వేస్తున్నారా? ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి?వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కొత్త స్కెచ్ వేశారు. మా పార్టీ కార్యకర్తలపై పదే పదే దాడులు జరుగుతున్నాయంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం. అంతర్గతంగా ఏపీలో ఎలాంటి దాడులు జరగకపోయినా.. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతే దాన్ని భూతద్దంలో చూపించాలన్నది అసలు ఆలోచన. జగన్ ఎత్తుగడలను ముందే పసిగట్టిన సీఎం చంద్రబాబు.. నేతలను,…
Read MoreAre the clothes on the side? Have you done the side? | సజ్జల సైడ్ అయిపోయారా.. సైడ్ చేశారా… | Eeroju news
సజ్జల సైడ్ అయిపోయారా.. సైడ్ చేశారా… గుంటూరు, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) Are the clothes on the side? Have you done the side? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేసినట్లే కనపడుతుంది. ఆయన స్క్రీన్ మీద కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన వల్ల పార్టీ డ్యామేజీ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లనే తాను రాంగ్ ట్రాక్ లో పడినట్లు జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలతో మాట్లాడటం దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించి జగన్ కు చేరవేయడంలో…
Read MoreFree sand that has become a farce | ప్రహసనంగా మారిన ఉచిత ఇసుక | Eeroju news
ప్రహసనంగా మారిన ఉచిత ఇసుక గుంటూరు, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Free sand that has become a farce ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా ఇసుక విక్రయాల్లో అమలు చేసిన విధానాలతో నిర్మాణ రంగం కుదేలైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విక్రయాలను నిలిపివేసి ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 43 మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో జనాలకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం దక్కడం లేదు. పట్టణాలు, నగరాల్లో ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం రాలేదు. గత మే నుంచి ఒకే రకమైన ధరలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పాలసీలో ఉన్న లోపభూయిష్టమైన విధానాలే దీనికి అసలు కారణంగా కనిపిస్తోంది. కృష్ణానదికి పొరుగున ఉన్న విజయవాడ వంటి…
Read MoreForm of Amaravati in a year | ఏడాదిలో అమరావతికి రూపం… | Eeroju news
ఏడాదిలో అమరావతికి రూపం… గుంటూరు, జూలై 26, (న్యూస్ పల్స్) Form of Amaravati in a year బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటించిన 15వేల కోట్ల సాయంతో.. నవ్యాంధ్రకు క్యాపిటల్ వర్క్స్ మళ్లీ ట్రాక్ ఎక్కనున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి.. పెండింగ్‌లో ఉండిపోయిన పనులను పరిశీలించారు. గత ఐదేళ్లలో అడవిలా మారిపోయి.. రోడ్లు, కాలువలు, రైతులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని ఏరియాలో కంప చెట్లను తొలగించేందుకే రూ.36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. మధ్యలో నిలిచిపోయిన రోడ్లు, ఇతర ప్రధాన మౌలిక వసతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల…
Read More