Link to loan waiver for ration cards | రేషన్ కార్డులకు రుణమాఫీకి లింకా | Eeroju news

Link to loan waiver for ration cards

రేషన్ కార్డులకు రుణమాఫీకి లింకా హైదరాబాద్, జూలై 17 (న్యూస్ పల్స్) Link to loan waiver for ration cards రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో సుమారు 10-12 లక్షల మంది కొత్త రేషన్‌కార్డులు, మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు. రేషన్‌కార్డులకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం రుణమాఫీకి రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో లక్షల మంది అర్హులు కూడా రుణమాఫీకి అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబసభ్యులను గుర్తించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉండగా ఇందులో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.…

Read More

KTR PA in scam? | గొర్రెల స్కామ్ లో కేటీఆర్ పీఏ ? | Eeroju news

KTR PA in scam?

గొర్రెల స్కామ్ లో కేటీఆర్ పీఏ ? కరీంనగర్, జూలై 17 (న్యూస్ పల్స్) KTR PA in scam? బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్కాములపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వాటిలో ముఖ్యంగా గొర్రెల స్కాంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి లింక్స్ బయటకు వచ్చినట్టు సమాచారం. 700 కోట్ల స్కాంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఎక్కడ దొరికితే అక్కడ దోచేశారు. మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, సీఈఓ రాంచందర్ అరెస్ట్ తర్వాత కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందుకు కళ్యాణ్ కుమార్ డేటా లిస్టులో తిరుపతి పేరు ఉండటం కేటీఆర్ వర్గాన్ని కలవరపెడుతోందిసిరిసిల్ల జిల్లాకు చెందిన రాజు అనే కాంట్రాక్టర్‌కి అప్పగించడంలో తిరుపతి పాత్ర చాలా ఉందని ఏసీబీ అధికారులు డేటా సేకరించారు.…

Read More

Ten others are ready not to hold hands | చేయి పట్టుకోనేందుకు మరో పదిమంది రెడీ | Eeroju news

Ten others are ready not to hold hands

చేయి పట్టుకోనేందుకు మరో పదిమంది రెడీ హైదరాబాద్, జూలై 16, (న్యూస్ పల్స్) Ten others are ready not to hold hands పదేళ్ల పాటు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతోంది. కనీసం జెండా మోసే నాయకుడు లేరన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికే ఓ MLA హస్తం గూటికి చేరగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పదేళ్లుగా BRSకు కంచుకోటగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోక వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఉద్యమపార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీ అని చెప్పుకున్న BRS నేతలు.. పదేళ్లు అధికారంలో తిరుగులేని విధంగా తమ హవా సాగించారు.…

Read More

Sagar.. Danger Bells | సాగర్.. డేంజర్ బెల్స్ | Eeroju news

Sagar.. Danger Bells

 సాగర్.. డేంజర్ బెల్స్ హైదరాబాద్, జూలై 16, (న్యూస్ పల్స్) Sagar.. Danger Bells తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నిన్న పలుచోట్లు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దించారు. హుస్సేన్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న…

Read More

KCR approached the Supreme Court | సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.? | Eeroju news

KCR approached the Supreme Court

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.? హైదరాబాద్ KCR approached the Supreme Court తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌నుతెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనున్నది. కాగా తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ…

Read More

Double pensions for 5650 people | 5650 మందికి డబుల్ పెన్షన్లు | Eeroju news

Double pensions for 5650 people

5650 మందికి డబుల్ పెన్షన్లు ఖమ్మం, జూలై  15  (న్యూస్ పల్స్) Double pensions for 5650 people రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్నట్లు సెర్ప్ నివేదికలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తేలింది. గత ఎన్నికల్లో అధికార మార్పిడితో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం.ప్రభుత్వ సర్వీసులో పని చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పొందుతున్న పెన్షన్ తో పాటు ఆసరా పెన్షన్ సైతం పొందుతున్న విడ్డూరం చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతుండగా ఇందులో 3826 మంది చనిపోయారు. ఇక 1826 మంది ఇప్పటికీ…

Read More

Ghost in Karimnagar temple | కరీంనగర్ గుడిలో దెయ్యం | Eeroju news

కరీంనగర్ గుడిలో దెయ్యం.

కరీంనగర్  గుడిలో దెయ్యం కరీంనగర్, జూలై  15   (న్యూస్ పల్స్) Ghost in Karimnagar temple గుళ్లో ఏముంటుంది..? అంటే దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, అక్కడ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే మీరు అవ్వాకైపోతారు. ఆ అంధవిశ్వాసమే.. ఇప్పుడా గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది..? అదంతా తెలుసుకోవాలంటే  ఈ స్టోరీ చదవాల్సిందే..గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్లు, చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతుంది. అరుపులు.. కేకలు.. పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో.. ఒకటేమిటీ ఇంకా చాలానే కనిపిస్తాయి. ఆ ఆలయం ఎక్కడో లేదు మన తెలంగాణలోనే ఉంది. ఇదిగో మనం చూస్తున్న ఈ గుడి…

Read More

A plan to curb drugs | డ్రగ్స్ అరికట్టేందుకు ప్లాన్ | Eeroju news

A plan to curb drugs

డ్రగ్స్ అరికట్టేందుకు ప్లాన్ హైదరాబాద్, జూలై 15  (న్యూస్ పల్స్) A plan to curb drugs రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లల్లో ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్ లు నిఘా పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ అధ్యక్షుడిగా హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఉండనున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ టీచర్ లేదా ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు.…

Read More

Congress Route Map on Jobs | ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ | Eeroju news

ఉద్యోగాలపై  కాంగ్రెస్ రూట్ మ్యాప్

ఉద్యోగాలపై  కాంగ్రెస్ రూట్ మ్యాప్ హైదరాబాద్, జూలై 15  (న్యూస్ పల్స్) Congress Route Map on Jobs తెలంగాణ రాకముందు ఏళ్లుగా పోరాటం.. తెలంగాణ వచ్చాక కూడా పదేళ్లుగా పోరాటం.. దేనికి ఉద్యోగాల కోసం. ఉన్న ఇంటిని విడిచి.. కోచింగ్ సెంటర్లకు వేలల్లో ఫీజులు కట్టి.. సగం తిని.. తినకా చెట్ల కింద కూర్చొని చదివేది ఎందుకు.. ? నోటిఫికేషన్లు పడతాయని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాలు సాధించే సమయం వచ్చే సరికి మళ్లీ అవే ఆందోళనలు. ఈసారి నోటిఫికేషన్లను వాయిదా వేయాలని.. ఇదేక్కడి లాజిక్.. ? మనం ఇన్నేళ్లుగా పోరాటాలు చేసింది ఈ ఉద్యోగాల కోసమే కదా.. తీరా చేతి వరకు వచ్చాక మళ్లీ వాయిదాలు వేస్తూ పోతే.. పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు? ఫలితాలు వచ్చేదెప్పుడు? అందుకే ఈ విషయంలో…

Read More

Heavily grown pulses | భారీగా పెరిగిన పప్పు దినుసులు | Eeroju news

Heavily grown pulses

భారీగా పెరిగిన పప్పు దినుసులు హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) Heavily grown pulses సామాన్యులకు నిత్యవసర సరుకులు ధరలు షాక్‌లు మీద షాక్‌లు ఇస్తున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు, సగటు వేతనజీవి బెంబేలెత్తిపోతున్నారు. మెున్నటి వరకు కేజీ టమోటా రూ.100కు పైగా పలకగా.. క్రమంగా ఆ ధరలు తగ్గుతున్నాయి. టమాట ధరలు తగ్గుతున్నాయని ఆనందపడే లోపే.. కందిపప్పు ధరలు కొండెక్కి కూర్చొని సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.నిన్న మెున్నటి వరకు కేజీ రూ.140-160 మధ్య ఉన్న కంది పప్పు ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం కిలో కంది పప్పు ధర రూ. 180-200 వరకు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో క్వాలిటీని బట్టి కేజీ రూ. 220-240 వరకు కూడా ధర పలుకుతోంది. ఇక కందిపప్పుతో పాటు మిగతా పప్పుల ధరలు కూడా పెరిగాయి. కేజీ…

Read More