స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు బీసీల పట్టు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో తెలంగాణ బంద్‌కు పిలుపు రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణలో ఈరోజు బంద్ కొనసాగుతోంది. బీసీ సంఘాలు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. బంద్ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బంద్‌లో భాగంగా బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి నిరసనలకు దిగారు. దీంతో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. రాజధాని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ సహా రాజేంద్రనగర్,…
Read MoreTag: #TelanganaPolitics
Kavitha : కవిత జాగృతి జనయాత్ర షురూ : ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యట
ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా రాష్ట్రవ్యాప్త పర్యటన ఆరు హామీల అమలు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రధానంగా దృష్టి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ‘జాగృతి జనయాత్ర’ చేపట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర నాయకులు కోల శ్రీనివాస్, నరేష్, అర్చన సేమపతి హాజరయ్యారు. యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష…
Read MoreBandiSanjay : కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు: బీఆర్ఎస్ కారు షెడ్డులో పడింది సెకండ్ హ్యాండ్‌లోనూ కొనరు
తామరపువ్వు గొప్పదనం తెలుసుకో కేటీఆర్ అన్న సంజయ్ మీ కారు షెడ్డులో పడిందని సెటైర్ సెకండ్ హ్యాండ్‌లో కూడా మీ కారును ఎవరూ కొనరని ఎద్దేవా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ గుర్తు ‘కారు’పై ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ గుర్తు ‘తామర పువ్వు’పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ గట్టిగా బదులిచ్చారు. “బుద్ధి లేని వాళ్లే తామర పువ్వు దేవుడి పూజకు పనికిరాదని అంటారు. బ్రహ్మ, విష్ణువు, లక్ష్మి, సరస్వతి దేవి అందరికీ తామరతో సంబంధం ఉంది. నీరు ఎంత పెరిగినా తామర అంటకుండా పైనే ఉంటుంది. అలాగే మా పార్టీ కూడా అన్ని సమస్యలను దాటి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది” అని కేటీఆర్‌కు హితవు…
Read MoreKavitha : బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయాలు: తెలంగాణ జాగృతి పునరుత్తేజం
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్టీ నేత లకావత్ రూప్ సింగ్‌కు బాధ్యతలు నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట అని కవిత వెల్లడి త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నట్లు ప్రకటన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి సస్పెండైన కొద్ది వారాల్లోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె స్థాపించిన సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతిని పునరుద్ధరించే దిశగా ఆమె కీలక అడుగులు వేశారు. పవిత్రమైన దసరా పండుగ సందర్భంగా సంస్థ రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను నియమించినట్లు కవిత ప్రకటించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట ఈ నూతన నియామకాల్లో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని కవిత స్పష్టం చేశారు. కొత్తగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలోని 80 శాతానికి పైగా పదవులను బడుగు, బలహీన వర్గాల వారికి కేటాయించినట్లు…
Read MorePrashantKishor : రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా – బీహార్ ప్రజల డీఎన్ఏ వ్యాఖ్యలపై ఆగ్రహం
బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి కష్టమ్మీద ముఖ్యమంత్రి అయ్యాడన్న ప్రశాంత్ కిశోర్ బీహార్ వారిని రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహం మోదీ, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని కాపాడలేరని వ్యాఖ్య రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కూడా కాపాడలేరని అన్నారు. బీజేపీ, టీడీపీ లాంటి పార్టీల మద్దతుతో కష్టమ్మీద ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, మరోసారి గెలవలేరని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బీహారీలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువ అని విమర్శించిన వ్యక్తి, ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని తనను మూడుసార్లు ఎందుకు…
Read MoreKTR : కేటీఆర్ ధీమా : తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ దే గెలుపు!
ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనన్న కేటీఆర్ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల మోసాన్ని ఎండగడతాం ప్రజలకు గుర్తుచేసేందుకే ‘బాకీ కార్డులు’ తెచ్చామన్న బీఆర్ఎస్ తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ పూర్తి సన్నద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాకీ పడిందని, వారి మోసాన్ని ప్రజల ముందు ఉంచేందుకే ‘బాకీ కార్డులు’ తీసుకొచ్చామని తెలిపారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ‘గ్యారెంటీ కార్డుల’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను గారడీ చేసిందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించిందని,…
Read MoreJubileeHillsByElection : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కాంగ్రెస్ కు దళిత నేతల సవాల్
కేటీఆర్‌తో భేటీ అయిన మాల సామాజికవర్గ ప్రతినిధులు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యమని స్పష్టీకరణ ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఉప ఎన్నికలో తమ బలాన్ని చాటుకుంటామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా ఓడిస్తామని మాల సామాజికవర్గ నేతలు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన తర్వాత ఈ నాయకులు ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాల సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానే తాము రాజకీయంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. “కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని…
Read MoreRevanthReddy : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: తెలంగాణలో ఒక ‘ట్రంప్’ ఉండేవారు!
కేసీఆర్ ను ట్రంప్ తో పోల్చిన రేవంత్ ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరిక ప్రజలు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపారని వ్యాఖ్య తెలంగాణలో గతంలో ఒక డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని, ఆయన పాలన నచ్చకనే ప్రజలు మూకుమ్మడిగా ఓడించి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ విమర్శలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం’ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు కొనసాగవు. వారు రాత్రి కలలో అనుకున్నది పగలు అమలు చేస్తుంటారు.…
Read MoreTelangana : తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర: కవితపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం వల్లే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశామన్న మహేశ్ గౌడ్ ఎవరు పార్టీలు పెట్టినా స్వాగతిస్తామని వ్యాఖ్య తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఏం సంబంధమని ప్రశ్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదంటూ కవిత చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కవితకు చరిత్రపై అవగాహన లేదని, “ఆమె ఎప్పుడు పుట్టారు? ఆమెకు చరిత్ర తెలుసా?” అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవానికి, కవితకు ఎలాంటి సంబంధం లేదని నిలదీశారు. చారిత్రక వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కొత్త పార్టీపై వ్యాఖ్యలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంశంపై కూడా మహేశ్ గౌడ్ స్పందించారు.…
Read MoreKavitha : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కవిత వ్యూహం
మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌కు ఉపఎన్నిక రేసులోకి కవిత.. సొంత అభ్యర్థిని నిలబెట్టే యోచన జాగృతి తరఫున విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసే అవకాశం విష్ణుతో కవిత భేటీ.. అరగంటకు పైగా మంతనాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన రాజకీయ సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నికను ఆమె ఒక వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి తరఫున ఒక సొంత అభ్యర్థిని బరిలోకి దింపడానికి కవిత సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి సోమవారం కవితతో భేటీ…
Read More