తిరుపతి, జూన్ 13, (న్యూస్ పల్స్) అందరి లక్ష్యం ఆయనే. ఆయన టార్గెట్ గా రాబోయే రాజకీయమంతా నడుస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శత్రువుల సంఖ్య అపారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి పని పట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ నేతలంతా కాచుకూర్చుని ఉన్నారు. ఒక్కరైతే పర్లేదు. కానీ కూటమిలోని మూడు పార్టీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శత్రువులున్నారు. ఈ ఎన్నికల్లో మరింత పెరిగారు. దీంతో ఆయన లక్ష్యంగా అధికార పార్టీ ఎక్కుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా సుదీర్థ రాజకీయాల నుంచి కొందరితో శత్రువులుంటే.. మరికొందరిని పార్టీ కోసం తనకు వ్యతిరేకంగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ముందు ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడమే అధికార పార్టీ నేతలకు ఫస్ట్ ప్రయారిటీగా మారనుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
Read MoreTag: Tirupati
చంద్రబాబు తిరుమల పర్యటనకు పటిష్టమైన భద్రత | Security tight for Chandrababu’s visit to Tirumala | Eeroju news
తిరుపతి బుధవారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు తిరుమల కు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం తిరుమలకు చేరుకుని గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరుపతి మీదుగా ఘాట్ రోడ్లు, తిరుమల, గాయత్రి అతిథిగృహం,వైకుంఠంకాంప్లెక్స్, శ్రీవారి ఆలయం వరకు రోడ్డు మార్గాన తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం లోపల, విఐపి గేటు, పార్కింగ్ ప్రదేశం, గ్యాలరీలను, పరిశీలించి పోలీసు, ఏర్పోర్ట్ భద్రతా సిబ్బంది పాటించవలసిన బందోబస్తు ప్రణాళికను అధికారులకు వివరించారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను పార్కింగ్ చేపించి యాత్రికులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి…
Read More