వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం, తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా, హైదరాబాద్‌లో కూడా రానున్న నాలుగు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు, ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడవచ్చు. అలాగే, రేపు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా,…
Read More