రుషికొండ రహస్యాలపై అనుమానాలు విశాఖపట్టణం, జూన్ 22, (న్యూస్ పల్స్) Doubts on the secrets of Rushikonda : విశాఖ పర్యాటక కేంద్రం. రుషికొండ అందాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 2019లో వైసీసీ అధికారంలోకి వచ్చే ముందు వరకు రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. పాత గదులు 34, కొత్త గదులు 24 కలిపి మొత్తం 58 గదులు ఉండేవి. పర్యాటకులు ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకుని అక్కడ బస చేసే వారు. రెస్టారెంట్, సమావేశ మందిరాలు ఉండేవి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వచ్చినట్టే.. రుషికొండకు కూడా పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లిపోయే వారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మూడు రాజధానుల అంశం, విశాఖ పరిపారాలనా రాజధాని అన్న విషయం తెరపైకి వచ్చిన కొన్ని రోజులకే…
Read MoreTag: Visakhapatnam
రాజ్ మహల్ ప్యాలెస్ తరహా నిర్మాణం… | Raj Mahal Palace style… | Eeroju news
రాజ్ మహల్ ప్యాలెస్ తరహా నిర్మాణం… రుషికొండలో ఇంటిని చూపించిన గంటా విశాఖపట్టణం, జూన్ 17, (న్యూస్ పల్స్) Raj Mahal Palace style : రుషికొండపై అత్యంత రహస్యంగా నిబంధనలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ భవనాన్ని తలపించే నిర్మాణాన్ని చేపట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.అత్యంత రహస్యంగా రూ.500 కోట్లు వెచ్చించి రాజమహల్ తరహాలో భవనాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన మొత్తం సైటు 61 ఎకరాలు కాగా, 9.8 ఎకరాల్లో భవనాన్ని రూ.500 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారన్నారు.ఏడు బ్లాకుల్లో సాగిన నిర్మాణాలకు ఒక్కో పేరు పెట్టారని గంటా వెల్లడించారు. పూర్వీకులు కాలంలో, సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు నిర్మించుకున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి ఈ భవన నిర్మాణాలను…
Read Moreవిశాఖ నుంచి మొదలు… | Starting from Visakha… | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 15, (న్యూస్ పల్స్) అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి. టీడీపీ నగరంలో బాగా బలపడింది. అయినా రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జీవీఎంసీలో జెండా ఎగురవేయకపోతే బాగోదని అప్పటి వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ విజయసాయి రెడ్డి ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జీవీఎంసీకి…
Read Moreవిశాఖలో తగ్గుతున్న రియల్ బూమ్ | Declining real boom in Visakhapatnam | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో అధికారం మార్పు… అనేక మార్పులకు దారి తీస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని భూముల ధరల మార్పు జరుగుతోంది. టీడీపీ కూటమి గెలవడంతో వైజాగ్ లో భూముల ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజల్లో మాత్రం పట్టలేనంత ఆనందం వెల్లువిరుస్తుంది.2014 రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు అనివార్యం అయింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎంపిక కోసం నాటి యూపీఏ-2 ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కే.సీ శివరామకృష్ణన్ చైర్మన్ గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించింది. ఈ కమిటీ తుది నివేదికను 2014 ఆగస్టు 31లోపు అందజేయాలని శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వం చెప్పిన…
Read Moreఅసెంబ్లీ స్పీకర్ కోసం… సీనియర్లు | For Assembly Speaker… Seniors | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14,(న్యూస్ పల్స్) కొత్త అసెంబ్లీలో కాబోయే స్పీకర్ ఎవరు? మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ పదవిపైనే పడింది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీని సమావేశపరిచి నూతన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోవాలి. సభలో సీనియర్ నేతలను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సభలో సీఎం చంద్రబాబుతో పాటు మరో ఇద్దరు నేతలు మాత్రమే ఏడు సార్లు గెలిచారు. చంద్రబాబు సీఎంగా ఉన్నందున ఆయనతో పాటు ఏడుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాల అయ్యన్నపాత్రుడులో ఎవరో ఒకరు ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. అయితే, స్పీకర్ పదవిపై కన్నేసిన ఈ ఇద్దరు నేతలు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు అంగీకరిస్తారా? అన్నదే ప్రశ్న.చంద్రబాబు 4.O ప్రభుత్వంలో అనేకమంది…
Read Moreప్రైవేటీకరణ చేస్తారా… ఆపేస్తారా… | Will Privatization… Stop… | Eeroju news
విశాఖపట్టణం, జూన్ 14, (న్యూస్ పల్స్) విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను..2021లో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించడంతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పటినుంచి అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారింది విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం. అయితే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నా కూడా ముందడుగే వేసింది కేంద్రం ప్రభుత్వం.అయిదేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సొంత గనులు లేకపోవడంతో…
Read More