నేడు ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభం ఆటో నడిపిన స్వర్ణలత అనే మహిళ ఉండవల్లి నుంచి స్టేడియం వరకు సుమారు 11.5 కిలోమీటర్ల ప్రయాణం ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఒక మహిళా ఆటో డ్రైవర్ నడిపిన ఆటోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయవాడలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు, ఆయన తన నివాసం నుంచి కార్యక్రమ స్థలానికి స్వర్ణలత అనే మహిళా డ్రైవర్ ఆటోలో వెళ్లారు. ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు సుమారు 11.5 కిలోమీటర్ల దూరం ఈ ప్రయాణం సాగింది. ఈ ప్రయాణంలో మంత్రి లోకేశ్.. ఆటో డ్రైవర్ స్వర్ణలతతో మాట్లాడారు. ఆమె కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తాను…
Read More