Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హనుమాన్ జయంతిన  ఆదిపురుష్ నుంచి ఆ పాట?

0

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించారు. ప్రభాస్ రాముడుగా, కృతి సీత పాత్రలో నటించిన ఈ మూవీలో హనుమంతుడుగా దేవదత్త నాగే నటించారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేవదత్త నాగు హనుమంతుడు గెటప్ లో ఉన్న లుక్ ను విడుదల చేశారు. దీంతో పాటు రిలీజ్ చేసిన ఓ పాట ట్యూన్ తో పాటు లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాట చూస్తే బ్యాక్ గ్రౌండ్ అదిరిపోతుందని ముందే అనిపిస్తోంది.

హనుమంతుడు అంటే బలం, పట్టుదల, విధేయత మూర్తీభవించిన యోధుడు. ఆ విషయమే హైలెట్ అయ్యేలా ఆదిపురుష్  మేకర్స్  శ్రీ బజరంగ్ బలి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభు శ్రీరాముని సహచరుడు, సంరక్షకుడుగా ఆ రామునికి నివాళులు అర్పిస్తున్నట్టుగా ఉన్న ఈ లుక్ తో హనుమాన్ జయంతి మరింత సంబురంగా మారింది.

త్వరలోనే ప్రమోషన్స్ ను మరింత వేగంగా మొదలుపెట్టబోతోంది ఆదిపురుష్ టీమ్.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ను టి-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫిల్స్‌కు చెందిన రాజేష్ నాయర్, UV క్రియేషన్స్‌కు చెందిన వంశీ మరియు ప్రమోద్‌ల సహకారంతో నిర్మించారు. ఈ చిత్రం 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie