Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

దేశంలో కాంగ్రెస్‌ను నమ్మే స్థితి లేదు

There is no confidence in Congress in the country

0
  • బిజెపికి బలం లేదు..కాంగ్రెస్‌కు గొడవలతోనే సరి
  • పార్టీలో చేరిన వారికి కండువా కప్పిన మంత్రి హరీష్‌

కాంగ్రెక్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైందని అన్నారు.  అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌ ‌తీరు ఎంత దారుణంగా ఉందో చూశామని హరీశ్‌ ‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి మంత్రి హరీశ్‌ ‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ ‌కూడా రాదన్నారు.  కాంగ్రెస్‌లో వాల్ల గొడవలు వాళ్లకే తప్ప ప్రజల బాధలు పట్టవని మండిపడ్డారు. బీజేపీకి బలం లేదు.

కాంగ్రెస్‌కు కాండిడేట్లు లేరు..బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నారు. ఎవరు ఔనన్నా, కాదన్నా బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం, కేసీఆర్‌ ‌మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. ఇది బీఆర్‌ఎస్‌ ‌పాలనకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.దేశంలో రైతులకు అండగా నిలిచి వారిని ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణలో మాత్రమే ఉందని, అందుకే ధాన్యం  దిగుబడుల్లో నెంబర్‌వన్‌గా నిలిచామని ఆన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్నదని అన్నారు. రైతుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. ఉచిత కరెంటుతోపాటు సాగునీరు ఇస్తూ రైతుబంధుతో ద్వారా పంట సాగుకు ఆర్థికసాయం, రైతుబీమా పథకాలను అమలు చేస్తూ బీఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వం అండగా ఉంటున్నది. వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ ‌బాసటగా నిలుస్తున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణలో పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం సీఎం కేసీఆర్‌ అం‌దజేస్తున్నారు. ఇటీవలి వర్షాలకు  నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పంటనష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie