Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మణిపూర్​తగలబడుతుంటే ప్రధాని నవ్వుతారా?

Rahul gandhi fire on Prime Minister modi

0
  • రెండు భాగాలుగా విడిపోయింది
  • సైన్యానికి అవకాశం ఇవ్వని మోడీ
  • ప్రధానిపై రాహుల్​ వ్యంగ్యాస్త్రాలు

మణిపూర్​తగలబడుతుంటే దేశ ప్రధాని మోడీ మాత్రం పార్లమెంట్​లో నవ్వుతూ సమాధానం ఇవ్వడం ఏంటని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలు, రాష్ర్టవ్యాప్తంగా అసలు మనిషన్నవారు బతకలేని రీతిలో హింస చెలరేగుతుంటే అలాంటి అంశంపై కేవలం రెండు నిమిషాలే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గురువారం పార్లమెంట్​లో ప్రధాని అడిగిన ప్రశ్నలకు శుక్రవారం రాహుల్​గాంధీ విలేఖరుల సమావేశంలో సమాధానమిచ్చారు. పార్లమెంట్​లో ప్రధాని జోకులు వేశారని, నవ్వారని దుయ్యబట్టారు. విషయం మణిపూర్​హింసపై మాట్లాడాల్సి ఉండగా, కాంగ్రెస్​ పార్టీపైనే రెండు గంటలు మాట్లాడారని విమర్శించారు. తాను 19 యేళ్లుగా రాజకీయాలలో ఉన్నానన్నారు. ఇన్ని సంవత్సరాలుగా భారత్​లో ఎన్నో క్లిష్టపరిస్థితులను చూశానన్నారు. వరదలు, భూకంపాలు, సునామీలు ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్​ పార్టీ బాధితులకు అండగా నిలుస్తూ వస్తోందన్నారు. బాధితులు చెప్పింది సావధానంగా వింటామన్నారు.

కానీ మణిపూర్​లో బాధితులు చెప్పింది ఇన్ని యేళ్లలో ఎక్కడ వినలేదన్నారు. అమిత్​షా, ప్రధాని మణిపూర్​లోనే భారత్​ను చంపేశారన్నారు. ఇప్పటికే మణిపూర్​పలు ప్రాంతాలుగా విభజన జరిగిందని ఆరోపించారు. తాము అక్కడికి వెళ్లినప్పుడు మైతేయి బాధితులను సందర్శించేందుకు వెళ్లామన్నారు. అప్పుడు మైతేయి బాధితులు తమతో కుకీలు ఎవరైనా ఉంటే మీ వెంట తీసుకురాకండి లేదంటే మేమే వారిని చంపేస్తాం.. ఆ తరువాత బాధ్యత మీరే వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారన్నారు. అదే కుకీ ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా వారు కూడా అలాగే మైతేయిలను బుల్లెట్లతో కాల్చివేస్తామని హెచ్చరించారన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఆ ఇరువర్గాల వారు తమ వెంట లేకుండా చూసుకున్నామన్నారు. దీంతో మణిపూర్​రెండు భాగాలుగా విభజించబడిందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

అందుకే తాను అంటున్నానని మణిపూర్​లో భారత్​ హత్య జరుగుతుంటే.. ప్రధాని మోడీ పార్లమెంట్​లో నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. భారతీయ సైన్యం మణిపూర్​లో హింసను రెండు రోజుల్లోనే ముగించగలదన్నారు. ఆ సత్తా సైన్యానికి ఉందన్నారు. కానీ ప్రధాని సైన్యానికి ఆ ఆదేశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మణిపూర్​తగలబడుతుంటే చూస్తున్నారన్నారు. మంటలను చల్లార్చే ప్రయత్నం ప్రధాని చేయడం లేదన్నారు. ప్రధాని స్వయంగా ఇరు వర్గాల సముదాయాల నేతలతోనైనా మాట్లాడి హింసను తగ్గించే చర్యలు ఇప్పటివరకూ ఎందుకు తీసుకోలేదన్నారు. కానీ ప్రధాని ఆ ప్రయత్నమూ చేయలేదన్నారు. 2024లో ప్రధానిగా మోడీ అవుతారా? కారా? అన్నది ప్రశ్న కాదని, మణిపూర్​లో అమాయకుల ప్రాణాలను రక్షించడం ఎలాగన్నదే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని రాహుల్​గాంధీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie