Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎవరు కాంగ్రెస్ పార్టీని వీడినా నష్టం లేదు..

0
  • జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది…
  • కోమటిరెడ్డి పై బురద జల్లడాన్ని ముక్తకంఠంతో ఖండించిన నేతలు..

ఎవరు కాంగ్రెస్ పార్టీని వీడినా నష్టం లేదని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అన్నారు. మంగళవారం కార్యకర్తల సమావేశం పట్టణ శివారులోని న్యూ వివేరా సమావేశ మందిరంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఏ ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని వీడినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను నమ్ముకుని నడుస్తున్న పార్టీ కాదని 138 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ అన్నారు. పార్టీ సముద్రం లాంటిదని సముద్రం నుంచి నీటి చుక్క వెళ్ళినంత మాత్రాన సముద్రానికి వచ్చే నష్టం ఏమీ లేదని డిసిసి అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి ఏనాడు కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా పనిచేయలేదన్నారు. ఆత్మ బి ఆర్ ఎస్ లో శరీరం కాంగ్రెస్ లో ఉండేదని కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బ్రష్టు పట్టించాలనే ఎజెండాతోనే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడన్నా రు. ప్రగతి భవన్ కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే అంతా నడిపించి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై విమర్శలు చేసి పెద్ద లీడర్ అవుదామని ఊహించుకొని పార్టీ మారడం జరిగిందని అన్నారు.

కార్యకర్తలు ఎవరు కూడా అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదని అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని అన్నారు. భువనగిరి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అనిల్ కుమార్ రెడ్డి పైళ్ల శేఖర్ రెడ్డి ఇద్దరూ ఒకటేనని నిన్న వారి బండారం బయట పడిందని ఇద్దరూ ఒకే గూటి పక్షులని భువనగిరి నియోజకవర్గ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఇన్నాళ్లు భువనగిరి నియోజకవర్గ ప్రజలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనిల్ కుమార్ రెడ్డి మోసం చేశారని బెంగళూరు బ్రదర్స్ గుట్టలు పంచుకున్న బ్రదర్స్ ల నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉన్నారని వారికి రాబోవు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై విమర్శలు చేసే అంత స్థాయి అనిల్ కుమార్ రెడ్డి ది కాదని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించిన అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారడం నాలుగు సంవత్సరాల క్రితమే నిర్ణయించుకొని ఏదో సాకు చూపించాలని ఉద్దేశంతో ముసలి కన్నీరు కారుస్తూ విమర్శలు చేసి పార్టీ మారడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకటరెడ్డిని విమర్శించి పార్టీలోకి రావాలని సీఎం కెసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకుల సూచనతో అన్ని నడిపించి నిన్న పార్టీ మారడం జరిగిందన్నారు.

 

అనిల్ కుమార్ రెడ్డి ఫెయిల్యూర్ డిసిసి అధ్యక్షుడు అని ఈనాడు జిల్లాలో పర్యటించి పార్టీ అభివృద్ధికి కృషి చేయలేదని అన్నారు. కార్యక్రమంలో వలిగొండ జడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి, బీబీనగర్, వలిగొండ మండల అధ్యక్షులు పాశం సత్తి రెడ్డి, సుర్కంటి సత్తి రెడ్డి, సీనియర్ పార్టీ నాయకులు అండెం సంజీవరెడ్డి, ఎల్లంల సంజీవరెడ్డి, పిసిసి కార్యదర్శి కసుబ శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ , ఎస్ టీ, బీసీ, మైనారిటీ సెల్ ఎన్ ఎస్ యు ఐ,అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్, భాస్కర్ నాయక్, గోద రాహూల్ గౌడ్, ఎండి బబ్లూ, మంగ ప్రవీణ్, ఎంపీపీ లు శ్రీశైలం, అశోక్, కౌన్సిలర్స్ ఈరపాక నర్సింహ, పడిగేల ప్రదీప్, నాయకులు వలిగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మందడి రామకృష్ణారెడ్డి, యుగంధర్ రెడ్డి, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, పొట్టోల్ల శ్యామ్, గోదా శ్రీనివాస్, మచ్చ నరసింహ, చిన్నం శీను, యువజన కాంగ్రెస్ నాయకులు గూడూరు నిఖిల్ రెడ్డి, కొల్లూరి రాజు, శివ గాని శ్రీధర్ గౌడ్,ఎండి షరీఫ్,ఎండి నజీర్, రఫియోధిన్, చల్లగురుగుల రఘుబాబు, దేవరకొండ నరసింహ చారి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie