Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పోగొట్టుకున్న 9వేల 720 ఫోన్లు

0

రికవరీ అయిన 4వేల 83 ఫోన్లు
వంద రోజుల్లోనే 9 వేల 720 మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. చోరీకి గురైన, తామే మరిచిపోయి వీటిని పోగట్టుకోగా… పోలీసులు వీటిని గుర్తించారు. సీఈఐఆర్ సాయంతో మొత్తం 4 వేల 83 ఫోన్లను రికవరీ చేసి వాటిని యజమానులకు అప్పగించారు. దొంగతనానికి గురైనా లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను గుర్తించడానికి తెలంగాణ పోలీసులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) సైట్‌ను ఉపయోగిస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సీఈఐఆర్ వినియోగంలో పోలీసులు తమ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇలా రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్‌లకు లాగిన్ ఐడీలను సరఫరా చేశారు. తెలంగాణలో అత్యధికంగా సైబరాబాద్‌ 554, రాచకొండ 321, వరంగల్‌ 300, హైదరాబాద్‌ 265 మొబైల్ ఫోన్లను అందించాయి.

ఫోన్ పోగొట్టుకోగానే, చేయాల్సిన పని ఇదే
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్‌లోకి లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన మొబైల్లోని నంబర్లు, IMEI నంబరు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్‌లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు పోయింది? ఎక్కడ పోయింది? రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఓటిపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. ఆ ఐడి మిస్సయిన ఫోన్ స్టేటస్ తెలుపుతుంది. అది ఎక్కడుంది? ఎవరి చేతుల్లో ఉంది అనే వివరాలను ఐడెంటిఫై చేస్తుంది. మొబైల్ ఏ కంపెనీది అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఆ ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఈ సాంకేతికను ఉపయోగించే పోలీసులు మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకున్నారు.

ఫోన్ దొరకగానే టాస్క్ అక్కడితో ఆగిపోదు
ఫోన్ దొరికిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడు చేయాల్సిన మరోపని- అన్ బ్లాక్! దీనికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఫోన్ దొరికిన అదే వెబ్‌ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. అడిగిన ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. లేకుంటే ఫోన్ ఆన్ కాదు. ఫోన్ పనిచేస్తున్న విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి. CEIR సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ పోయినా, చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్లో పిర్యాదు చేసుకోవాలని వివరిస్తున్నారు. ఆ సైట్‌పై ప్రత్యేక అవగాహన కలిగిఉండాలని పేర్కొంటున్నారు. దీని ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని స్పష్టం చేస్తున్నారు. ఈ సైట్ ఆపరేషనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie