Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అక్రమ సంపాదన కోసం అడ్డదారులు

0

హైదరాబాద్, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్)

స్టూడెంట్ వీసా మీద భారత్‌కు వస్తున్న నైజీరియన్లు ఇక్కడ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మెట్రో నగరాలనే టార్గెట్గా చేసుకుని వీసా ముగియగానే అక్కడికి మకాం మార్చేసి దర్జాగా గడుపుతున్నారు. మెట్రో సిటీకి వెళ్లగానే అక్కడ డ్రగ్ డీలింగ్స్ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పలువురు నైజీరియన్లు. అయితే ఎక్కువ శాతం నైజీరియన్లకు డ్రగ్స్ బిజినెసే ప్రధాన ఆదాయ మార్గం. డ్రగ్ సప్లై చేస్తూ కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు రాబడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ తెలంగాణలో ఇటీవల ఏర్పడిన తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా చాలా వరకు డ్రగ్ డీలింగ్స్‌ని కట్ చేసేశారు. ముఖ్యంగా గోవా లాంటి ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ రాకుండా పోలీసులు అడ్డుకట్టు వేశారు.

ఇంకా తమకి సమాచారం ఇస్తున్న ఇన్ఫార్మర్ల ద్వారా డ్రగ్ పెడ్ల్లర్‌పై దాడి చేసి వారి స్థావరాన్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నారు.అయితే పోలీసులు తెలుపుతున్న సమాచారం ప్రకారం ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెలబ్రిటీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు.. హైదరాబాద్ వదిలి గోవాకి వెళ్లి మరి డ్రగ్స్ సేవిస్తున్నారు తప్ప, ఇక్కడ ఉంటూ దక్షిణం తీసుకునే సహసం మాత్రం అతి కొద్ది మందే చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. నార్కోటిక్ పోలీసులు ఏకంగా గోవాకు వెళ్లి మరి అక్కడి డ్రగ్స్ డెన్‌లపై దాడులు చేశారు. కొందరు గోవా నుండి డ్రగ్స్‌ని హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడంతో పాటు, ఇక్కడ యూత్ డ్రగ్స్ వైపు ఆకర్షతులను చేస్తున్నారు.

దీంతో అలర్ట్ అయ్యిన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌కు డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై గట్టిగా నిఘా పెంచారు. డ్రగ్స్ వ్యాపారం ద్వారా వీరు సంపాదించిన ఆస్తులను సైతం సీజ్ చేస్తుండడంతో నైజీరియన్లు బెంబేలెత్తి పోతున్నారు.. దీంతో హైదరాబాద్ కస్టమర్లు అంటేనే నైజీరియన్లు అవైడ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.మెటల్ డిటెక్టర్ మాదిరి డ్రగ్స్‌ను కూడా డిటెక్ట్ చేసే పరికరం ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని వీలైనంతగా డ్రగ్స్‌ను అరికట్టేందుకు నార్కోటిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. డ్రగ్స్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అండ్ మోనిటరింగ్ సిస్టం(DOPEM) యాప్ ద్వారా దేశంలో ఎక్కడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా వారి వివరాలు తెలిసే విధంగా దీన్ని తీసుకొచ్చారు.. స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటరీ యాక్ట్ కింద అక్రమాలు చేసి డబ్బులు కూడా బెట్టుకుంటున్న వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie