Andhra Pradesh:కారులో వచ్చి మరీ దొంగతనాలు

There are a lot of thefts coming in cars.

Andhra Pradesh:వేస‌వి కాలంలో పిల్ల‌ల‌కు సెల‌వులు కావ‌డంతో చాలా మంది విహార యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. లేదా చుట్టాల ఇళ్ల‌కు వెళ్తుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యం కోసం ఎదురు చూస్తారు.. ప‌క్కా ప్లానింగ్‌తో రెక్కీ నిర్వ‌హిస్తారు.. తాళం వేసిన ఇళ్ల‌ను గుర్తిస్తారు.. తాళాలు ప‌గుల కొట్ట‌డం, తాళం తీయ‌కుండానే బోల్టులు విప్ప‌డం, అంతా ఇంట్లో నిద్రిస్తున్న స‌మ‌మంలోనే లోప‌ల‌కు వెళ్ల‌కుండానే కిటికీల గూండా గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌ళుపులు తీయ‌డం లో సిద్ధ హ‌స్తులు..

కారులో వచ్చి మరీ దొంగతనాలు

కాకినాడ, ఏప్రిల్ 29
వేస‌వి కాలంలో పిల్ల‌ల‌కు సెల‌వులు కావ‌డంతో చాలా మంది విహార యాత్ర‌ల‌కు వెళ్తుంటారు. లేదా చుట్టాల ఇళ్ల‌కు వెళ్తుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యం కోసం ఎదురు చూస్తారు.. ప‌క్కా ప్లానింగ్‌తో రెక్కీ నిర్వ‌హిస్తారు.. తాళం వేసిన ఇళ్ల‌ను గుర్తిస్తారు.. తాళాలు ప‌గుల కొట్ట‌డం, తాళం తీయ‌కుండానే బోల్టులు విప్ప‌డం, అంతా ఇంట్లో నిద్రిస్తున్న స‌మ‌మంలోనే లోప‌ల‌కు వెళ్ల‌కుండానే కిటికీల గూండా గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌ళుపులు తీయ‌డం లో సిద్ధ హ‌స్తులు.. ప‌ని ముగించుకున్నాక వారు వేసుకొచ్చిన కారు ఎక్క‌డ పార్కింగ్ చేశారో అక్క‌డ‌కు వెళ్లి దోచుకున్న న‌గ‌లు, న‌గ‌దుతో జారుకుంటారు..  ఇలా అనేక ఇళ్ల‌కు క‌న్నం వేసి అంత‌రాష్ట్ర ముఠా ఒక‌టి అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా పోలీసుల‌కు చిక్కింది.. తెలుగు రాష్ట్రాల్లో 32 చోరీలు చేసిన అంతర్రాష్ట్ర దొంగలు ముఠాను కోన‌సీమ పోలీసులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమలాపురం పట్టణంలో 2023, 2024, 2025 సంవత్సరాల్లో చోరీలు చేసిన ముగ్గురు దొంగ‌ల‌ను అమ‌లాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 40 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి. కృష్ణారావు విలేకర్ల సమావేశంలో చోరీల చిట్టాను వివరించారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తాము దొంగిలించిన సొత్తును నగుదుగా మార్చుతున్న సమయంలో అమలాపురం పట్టణ పోలీసులు ఆదివారం ఉదయం ఆరెస్ట్ చేశారు. జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి. వీరబాబుతో కలసి ఎస్పీ కృష్ణారావు ఈ చోరీల వివరాలను వెల్లడించారు.పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జంగా వెంకట్రావు. అదే జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన దమ్ము సుధాకర్, గుంటూరు అర్బన్ జిల్లా శ్రీరామ నగర్‌కు చెందిన కాట్ల కిషోర్ బాబు ఓ ముఠాగా ఏర్ప‌డ్డారు.. గ‌త అయిదేళ్లుగా వీరు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోరీలు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. విలాస వంత‌మైన జీవితానికి అల‌వాటుప‌డ్డ వీరు ముగ్గురు కారులో తిరుగుతూ స‌మీపంలోని లాడ్జీల్లో దిగి ఆపై కారుపై రాత్రివేళల్లో బ‌య‌లుదేరి దొంగ‌త‌నాలు చేస్తుంటార‌ని పోలీసులు తెలిపారు. ప‌గ‌టి పూట వీళ్లు టార్గెట్ చేసుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వ‌హించి ఆపై కారులోనే తిరుగుతారు. లేదా స‌మీపంలో ఎక్క‌డైనా పార్కింగ్‌చేసి ఆపై న‌డుచుకుంటూ తిరిగి రెక్కీ నిర్వ‌హించి టార్గెట్‌ను నిర్ణ‌యించుకుంటారు.

ఆపై ఆక్క‌డి నుంచి వెళ్లిపోయి తిరిగి కారులోనే తిరిగి వ‌చ్చి స‌మీపంలోనే ఎక్కడైనా పార్కింగ్‌చేస్తారు. ఆపై తాళాలు గుట్టుచ‌ప్పుడు కాకుండా తీసి ఆపై దోచుకుని వారు వ‌చ్చిన కారులోనే వెళ్లిపోతారు. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ, నల్గొండ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 చోరీలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 15 చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 32 చోరీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. అమలాపురం పట్టణం గాంధీనగర్ 2023 ఏప్రిల్లో మొదటి చోరీ, కురసాలవారివీధిలో 2024 ఆగస్టులో రెండో చోరీ, ఈ సంవత్సరం జనవరిలో మూడో చోరీ చేశారు. ఈ మూడు చోరీలకు సంబంధించి రూ.40 లక్షల సొత్తును రికవరీ చేశారు. నరసరావుపేటలో క్రికెట్ ఆటలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. కేసును ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులు ఈ మూడు చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు, క్రైమ్ పార్టీ సిబ్బందిని ఎస్పీ కృ ష్ణారావు అభినందించారు. వారికి నగదు రివార్డులు అందజేశారు. పట్టణ సీఐ పి. వీరబాబు, క్రైమ్ సీఐ ఎం గజేంద్రకుమార్, పట్టణ ఎస్ ఎన్ఆర్ కిషోర్బాబు, క్రైమ్ ఎస్సై రాంబాబు, ఏఎస్సై అయితాబత్తుల బాల కృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎంఎస్ రాజు, రమణ, కాని సాయి, శుభాకర్, ప్రసాద్, శ్రీనివాస్, అర్జున్, హరి, చిన్న ప్రసాద్ కు ఎప్పీ కృష్ణారావు నగదు రివార్డులు అందజేసి అభినందించారు.

Read more:Andhra Pradesh:కౌన్సిలర్ నుంచి పెద్దల సభ వరకు

Related posts

Leave a Comment