సంక్షిప్త వార్తలు : 16-05-2025:విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహద పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన హైదరాబాద్ గాంధీ నగర్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైంది.
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహద పడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన హైదరాబాద్ గాంధీ నగర్ లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైంది.
విద్యాసంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు, కొన్ని కాలనీ సంఘాలు ప్లే గ్రౌండ్లను పార్కులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్కుల అవసరం ఉన్నప్పటికీ, పిల్లలకు ఆటల కోసం ఓపెన్ గ్రౌండ్లు అవసరం. ఇవి వారి భవిష్యత్తుకు ఎంతో అవసరం.ప్రభుత్వ స్థలాలను అమ్మకుండా, వీటిని ఓపెన్ గ్రౌండ్లుగా, ప్లే ఏరియాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఈ స్థలాలు రాబోయే తరాల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడతాయి. ప్రతి బస్తీ, కాలనీలోని సంఘాలు తమ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్లను పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలి. ప్రభుత్వ స్థలాలను పచ్చదనంగా ఉంచుతూ, పిల్లల కోసం అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు..
గంజాయి వద్దనందుకు దాడి

హైదరాబాద్
అత్తాపూర్, సులేమాన్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గంజాయిని తమ ఇంట్లో పెట్టుకోవడానికి నిరాకరించినందుకు అజ్జు అనే వ్యక్తి, ఓ యువకుడిపై దాడి చేసి తలపై తీవ్రంగాగాయపరిచాడు. అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించిచికిత్సఅందిస్తున్నారు. ఈ ఘటన సులేమాన్‌నగర్ వాసులను తీవ్రఆందోళనకుగురిచేసింది. స్థానికంగాయువత గంజాయి మత్తులో పడి చెడు మార్గంలో పయనిస్తున్నారని, వారిని ఈ వ్యసనం నుండి కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ దాడి పై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరిశుభ్రత తోనే డెంగ్యూను అరికట్టవచ్చు
జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ హేమంత్ బోర్కడే గారితో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. డెంగ్యూ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు.
డెంగ్యూపై ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం తప్పనిసరి అన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉంచామని ఎలిజా పరీక్ష ద్వారా డెంగ్యూని పూర్తిగా నిర్ధారించేందుకు సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని సూచించారు.
ప్రేమ పేరుతో అక్కాచెల్లెళ్లను బ్లాక్ మెయిల్
మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం

మేడ్చల్
ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రేమ పేరు తో మైనర్ బాలికను ట్రాప్ చేయాడంతో బాధితురాలు ఆత్మహత్య యత్నాని కి పాల్పడింది. స్థానికంగా వుంటే అవినాష్ రెడ్డి, అక్క చెల్లెలను ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఇంస్టాగ్రామ్ లో పరిచయమై ఫొటోలు,వీడియో లు దిగాడు. చివరకు తనకు ప్రియురాలి చెల్లెలు తనకు కావాలంటూ అక్క ను అవినాష్ బ్లాక్ మెయిల్ చేసాడు.
ఫోటో లు వీడియో లు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని చెప్పాడు. తప్పని సరి పరిస్థితిలో అక్క తీసుకెళ్లి ఇచ్చింది. చివరకు ప్రియురాలితో చెల్లెను తీసుక రమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక మైనర్ బాలిక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మైనర్ల తండ్రి తిరుమల రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రైన్ కిందపడిన మృత్యుంజయుడు
షాద్ నగర్
షాద్ నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో ఓ పరిశ్రమలో పని చేసే కార్మికుడు బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళేందుకు స్టేషన్ లో రైల్వే లైను దాటుతుండగా నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా ముందుకు కదలడంతో రైల్వే లైన్ పై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పడుకొనిపోయాడు. గూడ్స్ ట్రైన్ వ్యాగన్ల తోపాటు ఇంజన్ కూడా వెళ్లిపోగా మృత్యుంజయుడు గా ప్రాణాలతో బయట పడ్డాడు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
