Andhra Pradesh : కేశినేని నాని అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు లేఖ ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాస్

MLA Kolika Pudi Srinivas

Andhra Pradesh :కేశినేని నాని అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాస్తున్నాం. సమగ్ర విచారణ జరిపించాలి అని సిబిఐ వారిని కోరుతున్నామని ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నాడు అయన ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం లో మీడియా తో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్దేశ పూర్వకం గా కేశినేని నాని బ్యాంకు ఋణం ఎగకోట్టాడు.

 కేశినేని నాని అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు లేఖ
ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాస్

విజయవాడ
కేశినేని నాని అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాస్తున్నాం. సమగ్ర విచారణ జరిపించాలి అని సిబిఐ వారిని కోరుతున్నామని ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నాడు అయన ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం లో మీడియా తో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్దేశ పూర్వకం గా కేశినేని నాని బ్యాంకు ఋణం ఎగకోట్టాడు. గత పది ఏళ్ళు ఎంపీ పదవి ని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి కేశినేని నాని  పాల్పడ్డాడు. ప్రజా జీవితం లో వున్నా వాళ్ళు మాట్లాడే మటలు వ్యక్తి గత వ్యాపార విషయాలు ప్రజలు గమనిస్తారు. మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు పై బురద చల్లే కార్యక్రమం గుడ్డ కాల్చి మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెడికల్ క్యాంపులు జాబ్ మేళాలు అన్నా కాంటీన్ లు అనేక సేవా కార్యక్రమలు చేసారని అన్నారు. ఇలాంటి వ్యక్తి పై బురద చల్లి లిక్కర్ స్కాం ను డైవర్ట్ చేస్తున్నారు.

ఒక కంపెనీ పెట్టి ఋణం తీసుకుని బ్యాంకుని మోసం చేసి కంపెనీ పేరుమర్చి భార్య భర్తలు ఇద్దరు పేరులు మార్చి తన దగ్గర పని చేసి ఇద్దరినీ డైరెక్టర్స్ గా పెట్టారు. ఆదాయాన్ని డైవర్ట్ చేసి ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూతుర్లని పెట్టి అక్కడ మోసం చేసారు. ఏదొక సంస్థను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకి పాల్పడింది కేశినేని నాని. గత 10 సంవత్సరాలు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని దుర్వినియోగనికి పాల్పడ్డడు. బ్యాంక్ పేరు బ్యాంక్ వివరాలు షెల్ కంపెనీల వివరాలు అన్ని చూపిస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరపాలి. రెండు  సార్లు టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. రాజకీయాల్లో లేను అంటూనే ఒక రాజకీయ ఎజెండా తో లిక్కర్ స్కాం విషయాన్నీ పక్క దారి పట్టిస్తున్నారు. గత సంవత్సర కాలం లో ఏనాడుయినా విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడరా. కేశినేని చిన్ని  వెనుకబడిన ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. తిరువూరు మైలవరం నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాలలో యువతను ప్రోత్సహం అందిస్తున్నారు. కేశినేని నాని ఇప్పటికైనా విమర్శలు మాని నైతిక విలువ కాపాడుకోండి. టీం ఎన్టీఆర్ జిల్లా లో 7 మంది శాసన సభ్యులు ఈ 11 నెలల కాలం లో చిన్ని  చేసిన అభివృద్ధి ఏంటో చెబుతాం. మీరు 10 సంవత్సరాలు చేసింది ఏంటని ప్రశ్నించారు.

Read more:Srinagar : జమ్మూకశ్మీర్లో లష్కరే ఉగ్రవాది హతం

Related posts

Leave a Comment