AP :రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని అధికారులు ప్రశ్నించారు. వారిలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. అయితే.. ఆయన విచారణకు హాజరయ్యే ముందు టీడీపీ కీలక నేతతో భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
టీ03 డీ03 తో విజయసాయిరెడ్డి..
వైరల్ గా మారిన వీడియో
విజయవాడ, మే 26
రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని అధికారులు ప్రశ్నించారు. వారిలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. అయితే.. ఆయన విచారణకు హాజరయ్యే ముందు టీడీపీ కీలక నేతతో భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.లిక్కర్ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన నాయకులు, అధికారులను ప్రశ్నించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సహా మరికొందరిని అరెస్టు చేసింది. అంతకుముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. తాజాగా విజయసాయికి సంబంధించి సంచలన విషయం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం.. విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నేత టీడీ జనార్ధన్‌ను కలిసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీ జనార్ధన్, విజయసాయి రెడ్డి ఒకరి వెంట ఒకరు.. ఒక ఇంట్లోకి వెళ్లడం, ఆ తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేర్వేరు కార్లలో వెళ్లడానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి టీడీపీనేతలతో సంబంధం ఉన్న వీడియోను వైసీపీ నేతలు బయటపెట్టారు. ఇటీవల వైఎస్ జగన్ కూడా విజయసాయిరెడ్డి చంద్రబాబుతో విజయసాయిరెడ్డి లాలూచీ పడ్డారని ఆరోపించిన నేపథ్యలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించకుంది. విజయసాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని తెలియజేసేందుకు ఈ వీడియోను వైసీపీ నేతలు విడుదల చేసినట్లు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై విజయసాయిరెడ్డి తన పదవులకు రాజీనామా చేశారన్న దానికి కూడా ఈ వీడియో ఒక ఉదాహరణ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని లోబర్చుకున్న టీడీపీ నేతలు ఆయనను కలసి జగన్ పై కావాలని మద్యం స్కాం కు సంబధించి ఆరోపణలు చేశారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే ఏడుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ చేసిన పోలీసులు ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి తో పాటు జగన్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇందులో మిధున్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అసలు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి పేరును బయటపెట్టింది విజయసాయిరెడ్డి.
ఆయన ఆ పేరు బయటపెట్టిన తర్వాత మాత్రమే కేసులో మరింత వేగం పెరిగింది. రాజ్ కేసిరెడ్డితో పాటుగా తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిలను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. . అయితే విజయసాయిరెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణకు పిలిచిన సమయంలో తెలుగుదేశం పార్టీ కి చెందిన కీలక నేత, చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడు అయిన తొండెపు దశరధ జనార్థన్ విజయసాయిరెడ్డితో సమావేశమవ్వడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వైర్ పత్రిక కథనం కూడా ఈ విషయాన్ని ప్రచురించింది. దీంతో మద్యం స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి టీడీపీ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టింగ్ లు పెడుతున్నారు. కావాలని జగన్ తో పాటు ఆయన కోటరీగా చెప్పుకునే వారిని ఇబ్బంది పెట్టేందుకు విజయసాయిరెడ్డి టీడీపీ చేతిలో పావుగా మారారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సిట్ విచారణకు హాజరయ్యే ఒకరోజు ముందు టీడీపీ నేత తొండెపు దశరథ జనార్థన్ తో విజయసాయిరెడ్డి మాట్లాడటం, తర్వాత ఆయన బయటకు వచ్చి రాజ్ కేసిరెడ్డి పేరు బయటకు చెప్పడంతో పాటు కోటరీ గురించి కూడా ప్రస్తావించడం వంటి అంశాలను కలగలిపి ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మార్చి 11 సాయంత్రం 5:49 గంటలకు విజయసాయి రెడ్డి.. తాడేపల్లిలోని పార్క్ విల్లేలో.. విల్లా నెం. 27లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావుదని సమాచారం. విజయసాయి రెడ్డి లోపలికి వెళ్లిన కొద్ది సేపటికి.. టీడీ జనార్ధన్ అదే విల్లాలోకి వెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లోనే భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం 6:50 గంటలకు విజయసాయి రెడ్డి బయటకు రాగా.. ఆ వెంటనే జనార్ధన్ కూడా విల్లా నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ అంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.లిక్కర్ స్కామ్ కేసు విచారణకు హారజరు కావడానికి కొన్ని గంటలు ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భేటీ జరిగిన కొన్ని గంటలు తరువాత.. విజయసాయి రెడ్డి సీఐడీ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి నుంచి జగన్ మీడియా సమావేశంలో విమర్శలు చేసిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో పాటు త్వరలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి పదవులు పొందుతారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తం మీద జగన్ చేసిన ఆరోపణలకు అద్దం పడుతూ సాయిరెడ్డితో తొండెపు దశార్ధన్ కలిసిన వీడియో బయటకు రావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.
విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Read more:AP : మహానాడులో టీడీపీ బిగ్ స్కెచ్
