Hyderabad:ఆ లింక్స్ తో జాగ్రత్త

Dance of the Hillary'

Hyderabad:భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గినా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు  హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా సైబర్ వార్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారత పౌరులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పాక్ సైబర్ దాడులు చేస్తోందని నగర పోలీసులు తెలిపారు. కాబట్టి ప్రజలు, మరీ ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఆ లింక్స్ తో జాగ్రత్త

హైదరాబాద్, మే 12
భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గినా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా సైబర్ వార్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారత పౌరులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పాక్ సైబర్ దాడులు చేస్తోందని నగర పోలీసులు తెలిపారు. కాబట్టి ప్రజలు, మరీ ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పాక్ ఈ సైబర్ యుద్ధానికి మాల్వేర్‌లో ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ అనే వైరస్‌ను వినియోగిస్తోంది. ఈ వైరస్‌ను వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్ రూపంలో పంపిస్తోంది.

ఒకసారి ఇది యాక్టివేట్ అయితే మన మొబైల్స్, కంప్యూటర్స్ శత్రువుల ఆధీనంలోకి వెళ్లినట్టేనని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ డేటాను చోరీ చేయడమే లక్ష్యంగా పాక్ ఈ సైబర్ అటాక్స్‌ను ప్లాన్ చేస్తోందని పోలీసులు అధికారులు చెబుతున్నారు. మాల్వేర్ అటాక్స్ ముప్పు ఉంటడంతో నగర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పద ఫైల్స్, లింక్స్, అటాచ్‌మెంట్స్ ఓపెన్ చేయొద్దని సూచించారు. మరీ ముఖ్యంగా .apk, .exe ఫైల్స్ ఓపెన్ చేయోద్దని చెబుతున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్‌లో తెలియని నెంబర్స్ నుంచి లింక్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని పట్టించుకోవద్దని సూచించారు.ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరిన్ని సూచనలు చేస్తున్నారు. తెలియని వ్యక్తులే కాదు.. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చే ఫార్వాడెడ్ లింక్స్ ఓపెన్ చేయొద్దు, వాటిని మళ్లీ ఫార్వాడ్ చేయొద్దని సూచించారు.

మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన APK ఫైల్‌లను ఇన్‌స్టాల్ చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరించారు. అత్యవసరం అనుకుంటే Google Play Store లేదా అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. OTPలు కూడా ఎవరికీ షేర్ చేయొద్దని చెబుతున్నారు సైబర్ క్రైమ్ అధికారులు. ఇక వాట్సాప్ లో వచ్చే ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్ లోడ్ అయ్యే సెట్టింగ్స్ ఆఫ్‌లో ఉంచుకోవాలని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పదమైన లింక్స్, అటాచ్ మెంట్స్ వస్తే cybercrime.gov.in లో తెలియజేయాలని వినియోగదారులను హైదరాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు.

Read more:Islamabad:భారత్ కు మద్దతుగా బెలుచిస్తాన్ ఆర్మీ

Related posts

Leave a Comment