Jammikunta:తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన పొన్నం. ఎన్ఎస్ యుఐ నాయకులు ఎండి ఇమ్రాన్..

Telangana State Transport Minister Ponnam Prabhakar

Jammikunta:గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన రోజు సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజీగిరిశరీఫ్ దర్గా లో  ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా లో చాదర్ లు సమర్పించడం జరిగింది మరియు దర్గా ఆవరణలో అల్పాహారం పంపిణీ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు.అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ ఎస్ ఆర్ ఆర్  కళాశాలలో ఎన్ ఎస్ యు ఐ, అధ్యక్షుడిగా మొదలైన తన రాజకీయ జీవితం ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ  ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత  రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా,మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారని.

తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన పొన్నం.
ఎన్ఎస్ యుఐ నాయకులు ఎండి ఇమ్రాన్..

జమ్మికుంట
గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన రోజు సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజీగిరిశరీఫ్ దర్గా లో  ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా లో చాదర్ లు సమర్పించడం జరిగింది మరియు దర్గా ఆవరణలో అల్పాహారం పంపిణీ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేశారు.అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ ఎస్ ఆర్ ఆర్  కళాశాలలో ఎన్ ఎస్ యు ఐ, అధ్యక్షుడిగా మొదలైన తన రాజకీయ జీవితం ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ  ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత  రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా,మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారని.అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు బిసి ఫోరం అధ్యక్షుడిగా తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ గా సేవలు అందించారని.. ఆ తర్వాత 2023 లో జరిగిన ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని.

మరియు వారి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ కు రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిందని. ఎన్ ఎస్ యు ఐ నుండి మొదలైన పొన్నం ప్రభాకర్  ప్రస్థానం విద్యార్థి దశ నుండి విద్యార్థుల కోసం అనునిత్యం కోట్లాడి ఆనాటి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ని ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చేసిన ఘనత పొన్నం ప్రభాకర్ ది అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు రైతుల పక్షాన కోట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత పొన్నం ప్రభాకర్ ది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎన్ఎస్ యుఐ, జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్, మాజీ ఎన్ ఎస్ యు ఐ  కరీంనగర్ జిల్లా కార్యదర్శి అజ్మత్, హుజూరాబాద్ నాయకులు మహమ్మద్ జియఉల్ అలీ, అలీశరీఫ్, చరణ్, దినేష్, యశ్వంత్, సురేష్, మహేష్, అనిల్, రాజేష్, నరేందర్, శ్రావణ్, అమీర్, మణిశ్, సిద్ధు,నరేష్, మధు  మరియు 20 మంది యువకులు పాల్గొన్నారు..

Read more:సంక్షిప్త వార్తలు:05-08-2025

Related posts

Leave a Comment