Kamanpur:ఆపదల ఆదుకునే వారే నిజమైన దేవుళ్ళు అని కమాన్పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్ కమాన్ పూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన గుర్రం వైష్ణవి అనే చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది. వారిది పేద కుటుంబం కావడంతో వైష్ణవి తల్లి రమ్య సుధా.. వైద్యం కోసం హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారాగోని సతీష్ ను కోరారు.
ఆపదలో ఆదుకునే వారే నిజమైన దేవుళ్ళు
కమాన్ పూర్
ఆపదల ఆదుకునే వారే నిజమైన దేవుళ్ళు అని కమాన్పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్ కమాన్ పూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన గుర్రం వైష్ణవి అనే చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది. వారిది పేద కుటుంబం కావడంతో వైష్ణవి తల్లి రమ్య సుధా.. వైద్యం కోసం హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారాగోని సతీష్ ను కోరారు. ఈ నేపథ్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు రూ,1, 33, 400 ల డబ్బులు జమ చేశారు. ఎస్. ఐ కొట్టె ప్రసాద్, కమాన్ పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా బాధితురాలు తల్లికి అందజేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్. ఐ కొట్టె ప్రసాద్ మాట్లాడుతూ.. హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి వైద్య సహాయం కోసం ఆర్ధిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా నిలిచినట్లు ఇక పై ముందుకూడా మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారగోని సతీష్ గౌడ్ , జబ్బార్ ఖాన్,ఇనగంటి రోహిత్ రావు, మెడగోని విజయ్ గౌడ్, గుర్రం లక్మిమల్లు, మల్యాల విజయ్ గౌడ్, నారగోని సరిత, గీసగోని శ్రీనివాస్ ,సయ్యద్ జాకీర్, ఎండి అఫ్సర్, చెన్నూరి అభిలాష్,పొన్నం రమేష్, కోలేటి మహేష్, నల్లెల్లి ఈశ్వర్, దయ్యాల రమేష్, సంద వంశీ, ఎండి అఫ్రోజ్ , సాజన్ పాటు తదితరులు పాల్గొన్నారు.
Read more:Hyderabad:ఆ లింక్స్ తో జాగ్రత్త
