New Delhi : అమెరికాకు భారత్ స్టాండ్ వివరించిన ప్రధాని

Prime Minister explains India's stand to America

New Delhi : జాతీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జమ్ముకశ్మీర్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఇది ఇండియాలో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించకుండానే చాలా క్లియర్‌గా పెద్దన్న అవసరం లేదు అని చెప్పేశారు.

అమెరికాకు భారత్ స్టాండ్ వివరించిన ప్రధాని

న్యూఢిల్లీ మే 13
జాతీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జమ్ముకశ్మీర్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఇది ఇండియాలో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించకుండానే చాలా క్లియర్‌గా పెద్దన్న అవసరం లేదు అని చెప్పేశారు. అసలు జమ్ముకశ్మీర్‌పై సమస్యే లేదని స్పష్టం చేశారు.పాకిస్థాన్‌తో తాను చర్చలకు కూర్చోవాలంటే అది పీవోకే, ఉగ్రవాదంపై మాత్రమే అని చెప్పిన ప్రధాన మంత్ర మోదీ టోన్‌లో చాలా డెప్త్ ఉందని అంటున్నారు. జమ్ముకశ్మీర్ అనేది ఇక్కడ సమస్య కాదని పీవోకే మాత్రమే సమస్యగా చెప్పేశారు. అన్నింటి కంటే ముఖ్యమైన మరో సమస్య ఉగ్రవాదమని ఈ రెండు విషయాలపై మాత్రమే చర్చించేందుకు సిద్దమని తేల్చి చెప్పారు.ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి చేయలేమని ప్రధాని మోదీ అన్నారు మరియు “నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన రెండు వారాల తర్వాత, మే 7న భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోదీ తొలి స్పందన ఇది.

ఇది యుద్ధాల యుగం కాదు’ అనే తన సందేశాన్ని పునరుద్ఘాటించారు. అలాగనే ఉగ్రవాదుల యుగం కూడా దాని తెలిపారు. “యుద్ధభూమిలో ప్రతిసారీ పాకిస్తాన్‌ ఓడిపోయింది. ఈసారి ఆపరేషన్ సిందూర్‌లో కొత్త అంశాన్ని జోడించాం. ఆపరేషన్ టైంలో ‘భారతదేశంలో తయారు చేసిన’ ఆయుధాలను వాడాం. వాటి ప్రామాణికత నిరూపితమైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరం ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత మనకు అతిపెద్ద బలం” అని మోదీ అన్నారు.మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి మాట్లాడుతూ “మొదటి మూడు రోజుల్లోనే పాకిస్తాన్‌లో భారత్‌ భారీ విధ్వంసం సృష్టించింది, అది వారిని పూర్తిగా నిస్సహాయులను చేసింది. భారత్‌ దూకుడు ఫలితంగా ఉద్రిక్తత తగ్గించడానికి పాకిస్థాన్ మార్గాలు వెతుక్కుంది. అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. పూర్తిగా ఓడిపోయిన తర్వాత మే 10 మధ్యాహ్నం మన DGMOని సంప్రదించి వేడుకుంది.” అని ఈ క్రెడిట్ కూడా అమెరికాకు ఇవ్వలేదు మోదీ. పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందని చెప్పారు. అంతే కానీ అమెరికా చెప్పిందనో ఎవరో బెదిరించారోనే వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇష్యూలో తానే క్రెడిట్ కొట్టేసేందుకు యత్నించారు. అందుకే ఇరు దేశాలతో చర్చలు జరిపామని అంగీకరించకుంటే వ్యాపారాలు నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. రెండు దేశాలు అణ్వాయుధ శక్తులని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశామన్నారు. ఇందులో తన కృష్టి ఫలిచిందని అన్నారు. అణు యుద్ధాల గురించి అమెరికా అధ్యక్షుడు చెప్పిన విషయాన్ని భారత్ ఖండించింది. అణ్వాయుధాలు ఉపయోగించాలన్న ఆలోచన భారత్‌కు ఎప్పుడూ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా 9 ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించాయి. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని ఉన్నత వర్గాల తెలిపాయి. మీరు ఆగిపోతే మేం ఆగిపోతామని పాక్ DGMO అభ్యర్థనకు భారతదేశం అంగీకరించిందని తెలిపాయి.

Read more:Hyderabad : మరింత ముందుగా నైరుతి రుతుపవనాలు

Related posts

Leave a Comment