Electric Scooter : కడపలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలుడు:కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఛార్జింగ్‌లో పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోవడంతో 62 ఏళ్ల వృద్ధురాలు వెంకట లక్ష్మమ్మ సజీవదహనమయ్యారు.ప్రతిరోజులాగే వెంకట లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు రాత్రిపూట ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి కడపలో విషాదం: మంటల్లో కాలి వృద్ధురాలి మృతి
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఛార్జింగ్‌లో పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోవడంతో 62 ఏళ్ల వృద్ధురాలు వెంకట లక్ష్మమ్మ సజీవదహనమయ్యారు.ప్రతిరోజులాగే వెంకట లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు రాత్రిపూట ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు. అయితే, తెల్లవారుజామున ఛార్జింగ్‌లో ఉన్న స్కూటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది.
స్కూటర్‌కు సమీపంలోనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మపై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా కాలిపోయి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read also:Helth News : నిద్ర రహస్యాలు: పర్యావరణం, రుతువుల ప్రభావం
