Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా

Minister Nara Lokesh Stands by Party Workers: A Pillar of Support for Balakotireddy's Family

Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా:‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి మంత్రి లోకేష్ పెద్దకొడుకులా అండగా ఉంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

కార్యకర్తలకు లోకేష్ అండగా

‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని నారా లోకేష్ (విద్య, ఐటీ శాఖల మంత్రి) అక్షరాలా పాటిస్తున్నారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీల దాడిలో దారుణ హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి మంత్రి లోకేష్ పెద్దకొడుకులా అండగా ఉంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దివంగత వెన్నా బాలకోటిరెడ్డి ఇంటిపై ఉన్న రుణాన్ని లోకేష్ తీర్చివేశారు. అంతేకాకుండా, ఆయన సతీమణి వెన్నా నాగేంద్రమ్మకు ప్రతినెలా ఆర్థిక సహాయం అందిస్తూ ఇంటికి పెద్దకొడుకులా ఆసరాగా నిలిచారు.

పార్టీ కోసం కష్టపడిన వారి బాధ్యతను తీసుకున్న మంత్రి లోకేష్

అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాల పాటు పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ గూండాలు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో, ఇంట్లో నిద్రిస్తున్న బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్యకు ఆరు నెలల ముందు కూడా కత్తులతో ఆయనపై దాడికి తెగబడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత నెల 21న మంత్రి లోకేష్ బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్థికంగా చాలా నష్టపోయామని, ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు కూడా తాకట్టులో ఉందని కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన లోకేష్, పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను తూచ తప్పకుండా నిలబెట్టుకున్నారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తల బాధ్యతను తన భుజాలపై వేసుకున్న మంత్రి లోకేష్, నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. అలాగే, ఉండవల్లిలోని తన నివాసంలోనూ కార్యకర్తలను నేరుగా కలుసుకొని వారికి అండగా నిలుస్తున్నారు.

Read also:KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: హామీల అమలుపై నిలదీత

 

Related posts

Leave a Comment