Lokesh : గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం: లోకేశ్ హాజరు; ఇద్దరు డీఎస్పీల మృతిపట్ల దిగ్భ్రాంతి

Ashok Gajapathi Raju Takes Oath as Goa Guv; Lokesh Condoles DSPs' Demise

Lokesh : గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం: లోకేశ్ హాజరు; ఇద్దరు డీఎస్పీల మృతిపట్ల దిగ్భ్రాంతి:ఈరోజు (జూలై 26, 2025) గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గోవా బయలుదేరి వెళ్లారు.

అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా ప్రమాణం; డీఎస్పీల మృతిపై లోకేశ్ విచారం

ఈరోజు (జూలై 26, 2025) గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గోవా బయలుదేరి వెళ్లారు. టీడీపీ సీనియర్ నేత అయిన అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.

తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read also:BJP : బీసీ బిల్లుపై రఘునందన్ రావుకు ఆది శ్రీనివాస్ ప్రశ్నలు

 

Related posts

Leave a Comment